రవితేజ సినిమా షూటింగ్ జాడ లేదు!


రవితేజ సినిమా షూటింగ్ జాడ లేదు!

రవితేజ సినిమా షూటింగ్ జాడ లేదు!

2018లో ఫ్లాపుల్లో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న రవితేజ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నిజానికి ఆయన ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్‌లో ఉండాలి. కానీ ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న జాడలు కనిపించడం లేదు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మార్చి 4న లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మార్చి 5 నుంచి షూటింగ్ జరుగుతుందని నిర్మాత రామ్ తాళ్లూరి ప్రకటించారు.

కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లిన సందడి కనిపించలేదు. హీరోయిన్లుగా ఎంపికైన పాయల్ రాజ్‌పుత్, నభా నటేశ్ వేరే సినిమాల సెట్స్‌పై కనిపిస్తున్నారు కానీ ‘డిస్కో రాజా’ సెట్స్‌పైకి రాలేదు. తర్వాత ఏప్రిల్ 16న తొలి షెడ్యూల్ మొదలు పెట్టడానికి నిర్మాత సన్నాహాలు చేశారు. కానీ ఈ రోజు కూడా షూటింగ్ మొదలు కాలేదని సమాచారం.

స్క్రిప్ట్ విషయంలో రవితేజ పూర్తి సంతృప్తితో లేకపోవడమే దీనికి కారణమని వినిపిస్తోంది. డైరెక్టర్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్న ఈ సినిమాకి అబ్బూరి రవి సంభాషణలు రాస్తున్నాడు. స్క్రిప్ట్ మరింత ఆసక్తికరంగా రావాలని రవితేజ అడిగారనీ, అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందనీ ఫిలింనగర్‌లో ప్రచారమవుతోంది.

ఇప్పటికే రెండుసార్లు షూటింగ్ వాయిదా పడటంతో ‘డిస్కో రాజా’ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు తమ ముందుకు వస్తుందో అర్థం కాక రవితేజ అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

రవితేజ సినిమా షూటింగ్ జాడ లేదు! | actioncutok.com

You may also like: