నాగబాబును గెలిపిస్తే నరసాపురాన్ని మురుక్కాలవ చేస్తాడు: శివాజీరాజా


నాగబాబును గెలిపిస్తే నరసాపురాన్ని మురుక్కాలవ చేస్తాడు: శివాజీరాజా
Sivaji Raja

నాగబాబును గెలిపిస్తే నరసాపురాన్ని మురుక్కాలవ చేస్తాడు: శివాజీరాజా

వచ్చే ఎన్నికల్లో నాగబాబును ఓడించాలని ‘మా’ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు శివాజీరాజా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయనకు ఓటేస్తే నష్టపోతామని ఆయన చెప్పారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

“నా నియోజకవర్గాన్ని నేను కాపాడుకోవాలి. అందుకే మంచి వ్యక్తి ఓటేయండి. నాగబాబు లాంటి వ్యక్తికి ఓటేశారంటే మనం నష్టపోతాం. ఆ ప్రాంతం వాడిగా ఈ విషయం చెప్పడానికి నాకు హక్కు ఉంది” అన్నారు శివాజీరాజా. రెండేళ్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడిగా ఉన్న నాగబాబు దాన్ని రెండేళ్లు కిందికి దింపేశారని విమర్శించారు.

“30 యేళ్ల స్నేహంలో నాగబాబు ఏమిటో నాకు తెలుసు. ఎవరైతే మెగా ఫ్యామిలీని తిట్టారో ‘మా’ ఎన్నికలకు ముందు వాళ్ల మధ్యలో కూర్చొని మాకు వ్యతిరేకంగా వాళ్లకి సపోర్ట్ చేస్తున్నానని అన్నప్పుడు నాకు నిద్ర రాలేదు. ఇదా చేసేది? మెగా ఫ్యామిలీకి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని. ప్రాణమిచ్చే అభిమానిని  వెన్నుపోటు పొడవడమంటే ఇదే” అని నాగబాబును ఆయన దుయ్యబట్టారు.

మెగా ఫ్యామిలీని తిట్టేవాళ్లు నాగబాబుకు మంచోళ్లనీ, మెగా ఫ్యామిలీని ప్రాణప్రదంగా చూసుకునేవాళ్లు ఆయనకు దూరమైనవాళ్లనీ ఆయన ఎద్దేవా చేశారు. నాగబాబు నరసాపురం ఎంపీ అయితే దాన్ని మురుక్కాలవ చేస్తాడని ఆరోపించారు.

“నాకు తెలుసు నీ కెపాసిటీ. ఎందుకంటే నువ్వు కిచెన్‌లోంచి హాల్లోకి రావడానికి అరగంట, హాల్లోంచి కారెక్కడానికి అరగంట పడుతుంది. అలాంటిది నువ్వు ఇక్కడ్నుంచి నరసాపురానికి వెళ్లి సేవ చేస్తావా?” అని నాగబాబును ప్రశ్నించారు శివాజీరాజా.

ఇటీవల ‘మా’ ఎన్నికల్లో తన ప్రత్యర్థి ప్యానల్‌కు సపోర్ట్ చేసి, తాను ఓడిపోవడానికి కారకుల్లో ఒకరిగా నిలిచిన నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీరాజా అప్పుడే చెప్పారు. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే కసి ఆయనలో కనిపిస్తోంది.

నాగబాబును గెలిపిస్తే నరసాపురాన్ని మురుక్కాలవ చేస్తాడు: శివాజీరాజా | actioncutok.com

You may also like: