కేసీఆర్‌కు సినిమావాళ్లు భయపడుతున్నారనడంలో నిజం లేదు


కేసీఆర్‌కు సినిమావాళ్లు భయపడుతున్నారనడంలో నిజం లేదు
Manchu Vishnu

కేసీఆర్‌కు సినిమావాళ్లు భయపడుతున్నారనడంలో నిజం లేదు

ఇంటర్మీడియేట్ పరీక్షల్లో తప్పామనే ఆందోళనతో తెలంగాణలో 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం మనసున్న ప్రతి ఒక్కరి హృదయాన్నీ కలచివేసింది. అందులో ఇంటర్మీడియేట్ బోర్డ్ తప్పిదాల వల్ల చాలామంది విద్యార్థులకు మార్కులు తప్పుల తడకగా రావడాన్ని అందరూ విమర్శిస్తుంటే ఒక్క రంగానికి చెందిన వాళ్లు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒక్క మాటా అనడం లేదు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోకూడదని మాత్రం సూచిస్తున్నారు.

ఆ రంగం.. తెలుగు చలనచిత్ర రంగం. దీంతో సినిమావాళ్లు కేసీఆర్‌కు భయపడే ఇంటర్ ఫలితాల్లోని అవకతవకల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం లేదనే ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్‌కు సినిమావాళ్లు భయపడుతున్నారనే మాటలు కేవలం ఊహాగానాలేననీ, అందులో ఏమాత్రం నిజం లేదనీ హీరో మంచు విష్ణు అంటున్నాడు.

ఆయన సైతం ఇంటర్ ఫలితాల వ్యవహారంలో ప్రభుత్వాన్ని ఒక్క మాటా అనలేదు. పొరబాట్ల వల్లే అత్యంత బాధాకరంగా 20 మంది తమ్ముళ్లు చెల్లెళ్లను కోల్పోయామని ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశాడు. ఆ హేయమైన చర్య విషయంలో ప్రభుత్వం కనుక స్పందించకపోతే, అది కచ్చితంగా విమర్శకు దారి తీసేదని ఆయన్నాడు.

కేటీఆర్ క్రియాశీలక, విద్యార్థి అనుకూల రాజకీయ నాయకుడని తనకు తెలుసునని విష్ణు చెప్పాడు. కేసీఆర్‌కు ఫైర్‌బ్రాండ్‌గా పేరుందనీ, అయితే ఆయన డిక్టేటర్ కాదనీ విష్ణు అభిప్రాయపడ్డాడు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడానికి బదులు, అసలు కారణం తెలుసుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన ఒత్తి పలికాడు.

“కేసీఆర్‌కు సినిమావాళ్లు భయపడుతున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్లు గొప్ప ఊహాగానాలు చేస్తున్నారని చెప్పదలచుకున్నా. అందులో ఏమాత్రం నిజం లేదు. మొదట కారణాలు కనుక్కోవాలనే దానిపైనే నా దృష్టి. అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా ఆపగలం” అని పోస్ట్ చేశాడు విష్ణు.

కేసీఆర్‌కు సినిమావాళ్లు భయపడుతున్నారనడంలో నిజం లేదు | actioncutok.com

You may also like: