‘వెంకీ మామ’ ఫస్ట్ లుక్ వచ్చింది


'వెంకీ మామ' ఫస్ట్ లుక్ వచ్చింది

‘వెంకీ మామ’ ఫస్ట్ లుక్ వచ్చింది

వెంకటేశ్, నాగ చైతన్య కథానాయకులుగా నటిస్తున్న ‘వెంకీ మామ’ మూవీ ఫస్ట్ లుక్‌ను ఉగాది పండుగను పురస్కరించుకొని శనివారం విడుదల చేశారు. పాయల్ రాజ్‌పుత్, రాశీ ఖన్నా నాయికలుగా నటిస్తున్నారు.

కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బేనర్లపై డి. సురేశ్, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వడ్ల బస్తాలపై పక్క పక్కనే కూర్చున్న వెంకటేశ్, చైతన్య నవ్వులు కురిపిస్తున్నట్లున్న ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెనుక వరిపొలాలు, గుడి ఉండటాన్ని బట్టి చూస్తే ఇది గ్రామీణ వాతావరణంలో ఎక్కువగా రూపొందుతున్న సినిమాగా అర్థమవుతుంది. అందుకు తగ్గట్లే తొలి షెడ్యూల్‌ను రాజమండ్రిలో నిర్వహించారు.

సోమవారం (ఏప్రిల్ 8) నుంచి హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

‘వెంకీ మామ’ ఫస్ట్ లుక్ వచ్చింది | actioncutok.com

You may also like: