‘కాంచన’ రీమేక్‌లో హీరో కేరెక్టర్ని మార్చేశారు!

‘కాంచన’ రీమేక్‌లో హీరో కేరెక్టర్ని మార్చేశారు!
రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ‘కాంచన’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఆ సినిమా హిందీలో ‘లక్ష్మీ’ పేరుతో రీమేక్ అవుతోంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించే ఈ సినిమాని లారెన్స్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఒరిజినల్లో లక్ష్మీరాయ్ చేసిన హీరోయిన్ రోల్‌ను హిందీలో కియారా అద్వానీ పోషిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం రీమేక్’లో హీరో కేరెక్టర్ తీరుతెన్నుల్ని మార్చేస్తున్నారు. ఒరిజినల్లో హీరో రాఘవకు దెయ్యాలంటే అమిత భయం. రాత్రివేళ టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే ఎవరో ఒకరు తోడుగా టాయిలెట్ దాకా రావాల్సిందే. సాధారణంగా ఆ డ్యూటీ అతడి తల్లే తీసుకుంటుంది.
అలాంటి రాఘవ రోల్‌ను హిందీలో ధైర్యవంతుడిగా మార్చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఆ మేరకు స్క్రిప్టులో మార్పులు చేశారని వినికిడి. రచయిత ఫరాద్ సంజి నేతృత్వంలో ఈ మార్పులు జరిగాయి. ఒరిజినల్లో కాంచన అనే హిజ్రా హత్యకు గురై దెయ్యంగా మారి రాఘవను ఆవహిస్తే, రీమేక్‌లో లక్ష్మి అనే హిజ్రా దెయ్యంగా మారి హీరోని ఆవహిస్తుంది.
లక్ష్మి పాత్రను ఎవరు చేస్తున్నారనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.
‘కాంచన’ రీమేక్‌లో హీరో కేరెక్టర్ని మార్చేశారు! \ actioncutok.com
You may also like: