పవన్ రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా: అలీ


పవన్ రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా: అలీ
Ali

పవన్ రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా: అలీ

“కష్టాల్లో ఉన్నప్పుడు అలీని ఆదుకున్నాను. చెప్పాపెట్టకుండా వైసీపీలోకి వెళ్లిపోయాడు. అందుకే బంధుమిత్రుల్ని కాకుండా ప్రజలనే నమ్ముకున్నాను” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రి ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలకు అలీ ఘాటుగా సమాధానమిచ్చారు.

“నేను కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బిచ్చారా? సినిమా అవకాశాలిప్పించారా?” అని పవన్‌ను ఆయన ప్రశ్నించారు. తన బాటను తానే వేసుకున్నానని, తన బాటలో తను నడిచాననీ చెప్పిన అలీ “చిరంజీవిగారు వేసిన బాటలో మీరు వచ్చారు. నాకు ఎవరి సపోర్ట్‌ లేదు. చెన్నై నాకు జీవితాన్ని ప్రసాదించింది. ఎంతో కృషి చేస్తే, నేను ఈ స్థాయిలో ఉన్నా” అని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడిన వీడియోను వైసీపీ విడుదల చేసింది.

పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రాకముందే తాను మంచి స్థానంలో ఉన్నానని అలీ అన్నారు. “నేను ఎవరి దగ్గరకు వెళ్లి, ‘అయ్యా నాకు సాయం చేయండి’ అని అడగలేదు. ఆ అల్లా దయ వల్ల చాలా బాగున్నా. ఒకవేళ అడిగే అవకాశం వస్తే, అప్పటికి అలీ ఉండడు. ఆకలితో చచ్చిపోతాను తప్ప వెళ్లి అడుక్కోను” అని చెప్పారు అలీ.

పవన్ రాకముందే నేను మంచి స్థానంలో ఉన్నా: అలీ | actioncutok.com

You may also like: