నాకు పేరొస్తే క్రెడిట్ ఆయనదే: సాయిధరమ్ తేజ్


నాకు పేరొస్తే క్రెడిట్ ఆయనదే: సాయిధరమ్ తేజ్

నాకు పేరొస్తే క్రెడిట్ ఆయనదే: సాయిధరమ్ తేజ్

ఆరు ఫ్లాపుల తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన సినిమా ‘చిత్రలహరి’. కిశోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ నాయికలుగా నటించిన ఈ సినిమా శుక్రవారం (ఏప్రిల్ 12) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా తేజ్ చెప్పిన ‘చిత్రలహరి’ కబుర్లు ఆయన మాటల్లోనే…

మొదట నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది. తర్వాత కేరెక్టర్లు నచ్చాయి. ప్రతి కేరెక్టర్‌కీ ఒక కంప్లీట్‌నెస్ ఉంటుంది. కథ వినగానే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాలో. ఈ సినిమా చెయ్యడానికి ప్రధాన కారణం అదే. ఇంతదాకా నేను చేసిన కేరెక్టర్లకు ఏమాత్రం సంబంధం లేని కేరెక్టర్ చేశాను. కిశోర్ తిరుమల గారు నన్ను చాలా భిన్నంగా ఈ సినిమాలో ప్రెజెంట్ చేశారు.

లూజర్‌గా కనిపించాలని..

ఇప్పటివరకూ నేను కనిపించిన దానికి పూర్తిగా భిన్నమైన లుక్ ఉండాలనే ఉద్దేశంతో డైరెక్టర్ కిశోర్ తిరుమల, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని నా లుక్‌పై బాగా ఫోకస్ పెట్టారు. కేరెక్టర్ స్కెచెస్ వేశారు. ఫొటో షూట్స్ చేశారు.

చూడ్డానికి లూజర్‌గా కనిపించాలని ఈ ఫుల్ బియర్డ్ లుక్ ఓకే చేశారు. కాస్ట్యూమ్స్ కూడా దానికి తగ్గట్లే డిజైన్ చేశారు. ఈ లుక్‌లో నేను లూజర్‌లాగే ఉన్నానని వాళ్లు భావించారు. సినిమా పూర్తయినా కూడా నాకు ఈ గడ్డం నచ్చి అలాగే ఉంచేశాను.

విజయ్‌కూ, తేజ్‌కూ చాలా పోలికలు

సక్సెస్‌లో ఉన్నప్పుడు మన దగ్గరకు చాలామంది వస్తారు. అదే ఫెయిల్యూర్‌లో ఉంటే అతి తక్కువమందే మనతో ఉంటారనేది నాకు బాగా అనుభవంలోకి వచ్చింది. ఆరు ఫ్లాపుల తర్వాత నాతో ఉన్నది చాలా తక్కువమందే. మిగతావాళ్లంతా వెళ్లిపోయారు. సినిమాలో నేను చేసిన విజయ్ పాత్రకూ, నిజ జీవితంలో తేజ్‌కూ చాలా పోలికలున్నాయి. నా మునుపటి రెండు సినిమాల ఫలితాలు విజయ్ కేరెక్టర్‌లా ప్రవర్తించడానికి నాకు బాగా ఉపయోగపడ్డాయి.

సునీల్ బ్యూటిఫుల్‌గా చేశాడు

సినిమాలో సునీల్ అన్న నా ‘గ్లాస్‌మేట్’. ఒక బార్‌లో నాకు పరిచయమవుతాడు. పాత్ర ప్రకారం జీవితంలో ఆయనకంటూ ఒక ఫిలాసఫీ ఉంటుంది. సునీల్ అన్న చాలా బ్యూటిఫుల్‌గా ఆయన పాత్రను చేశాడు. అతనితో కలిసి పనిచేయడాన్ని చాలా బాగా ఆస్వాదించాను.

నాకు పేరొస్తే క్రెడిట్ ఆయనదే: సాయిధరమ్ తేజ్
సెటిల్డ్‌గా చేయించారు

కిశోర్ తిరుమల రైటర్‌గా ఉన్నప్పట్నుంచీ నాకు తెలుసు. అతను డైరెక్టర్ అయ్యాక హ్యాపీ ఫీలయ్యాను. ‘నేను.. శైలజ’ చాలా బాగా తీశారు. ‘చిత్రలహరి’లో నన్ను కొత్తగా చూపించారు.

ఇప్పటి దాకా నేనో బాడీ లాంగ్వేజ్‌కి అలవాటుపడిపోయాను. దాన్నుంచి నన్ను బయటకు తీసుకొచ్చారు కిశోర్. నా చేత సెటిల్డ్‌గా పర్ఫాం చేయించారు. తను బెటర్‌మెంట్ కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. నా కేరెక్టర్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో నాకు పేరొచ్చిందంటే ఆ క్రెడిట్ ఆయనదే.

‘గ్లాస్‌మేట్స్’ నా ఫేవరేట్!

పాటల్లో నా ఫేవరేట్ ‘గ్లాస్‌మేట్స్’. డాన్స్ కాకుండా తాగిన తర్వాత బిహేవియర్ ఎలా ఉంటుందనే దాన్ని ఈ పాటలో కేప్చర్ చెయ్యడానికి ప్రయత్నించాం. ఒక వైపు మేం షూటింగ్ చేసే సమయానికి వర్షం పడుతోంది. అయినప్పటికీ మేం ఆ పాటను బాగా చెయ్యగలిగాం. ఆ పాట నాకు బాగా నచ్చింది. అలాగే నా ఇంట్రడక్షన్ సాంగ్ ‘పరుగు పరుగు..’కూడా నచ్చింది.

– సజ్జా వరుణ్

నాకు పేరొస్తే క్రెడిట్ ఆయనదే: సాయిధరమ్ తేజ్ | actioncutok.com

You may also like: