‘జెర్సీ’ విషాదాంతమని ట్రైలర్ చెబుతోందా?


'జెర్సీ' విషాదాంతమని ట్రైలర్ చెబుతోందా?

‘జెర్సీ’ విషాదాంతమని ట్రైలర్ చెబుతోందా?

నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మూడు రోజుల క్రితం విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నాని జోడీగా కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ నటించింది.

ట్రైలర్ చూశాక బయట ప్రచారంలో ఉన్న సినిమా కథ నిజమనే అభిప్రాయం కలుగుతోంది. ఆ కథేమిటంటే.. అర్జున్ (నాని) టాలెంటెడ్ క్రికెటర్. సారా (శ్రద్ధ) అనే క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఒక సమస్య వల్ల అర్జున్ క్రికెట్‌ను వదిలెయ్యాల్సిన స్థితి వస్తుంది.

అర్జున్, సారా పెళ్లి చేసుకుంటారు. వాళ్లకు ఒక కొడుకు పుడతాడు. కుటుంబాన్ని సారానే పోషిస్తుంటుంది. తండ్రి ఒకప్పుడు టాప్ క్రికెటర్ అనే విషయం ఆ కొడుక్కు తెలుస్తుంది. తండ్రిని మళ్లీ క్రికెటర్‌గా చూడాలని ఆ అబ్బాయి ఆశిస్తాడు.

కానీ క్రికెట్ ఆడితే ప్రాణాలు పోయే స్థితి అర్జున్‌ది. అయినా సరే.. కొడుక్కు ఆనందం కలిగించాలని క్రికెట్ ఆడతాడు అర్జున్. కొడుకును సంతోషపెడతాడు. కానీ ప్రాణాలు వదిలేస్తాడు… ఇదీ బయట నానుతున్న కథ.

'జెర్సీ' విషాదాంతమని ట్రైలర్ చెబుతోందా?

సినిమా మొదట్లోనే అర్జున్ ప్రాణాలు పోయే స్థితిలో ఉంటాడనీ, ఫ్లాష్‌బ్యాక్ టోన్‌లో కథ నడుస్తుందనీ అంటున్నవాళ్లూ ఉన్నారు. ముందే ప్రేక్షకుల్ని సిద్ధం చేసి, కట్టిపడేసే భావోద్వేగాలతో డైరెక్టర్ కథను నడిపించాడనీ, అందువల్ల అర్జున్ చనిపోతాడని ముందే తెలిసినా ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోతారనీ వినిపిస్తోంది.

ట్రైలర్‌లో చూపించిన ‘ఎవ్విరి జర్నీ హాజ్ టు ఎండ్’ అని చూపించడం ఈ ప్రచారాన్ని బలపరిచేదిగా ఉంది. “నీకు అవసరానికి మించి ఆశపడే కొడుకున్నా సంపాదించే పెళ్లా లేదు” అని సారా విసుక్కోవడం, “ఇంతపెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్ చెయ్యంది నా కొడుకొక్కడే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గినా తట్టుకోలేను” అని అర్జున్ ఎమోషనల్ అవడం ఆ కథ నిజమనే అభిప్రాయం కలిగేలా చేస్తున్నాయి.

ఒక్కటి మాత్రం స్పష్టం. ఈ సినిమాతో మనముందు ఒక సరికొత్త నాని ఆవిష్కృతం కాబోతున్నాడు. నటుడిగా నానిలోని మరో కోణం బయటపడనుంది.

'జెర్సీ' విషాదాంతమని ట్రైలర్ చెబుతోందా?

‘జెర్సీ’ విషాదాంతమని ట్రైలర్ చెబుతోందా? | actioncutok.com

You may also like: