రాజశేఖర్ చిన్నకూతురు ‘దొరసాని’!


రాజశేఖర్ చిన్నకూతురు 'దొరసాని'!

రాజశేఖర్ చిన్నకూతురు ‘దొరసాని’!

జీవిత, రాజశేఖర్ దంపతుల పెద్ద కూతురు శివానీ ‘2 స్టేట్స్’ రీమేక్‌తో హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వాళ్ల చిన్న కూతురు శివాత్మిక సైతం నాయికగా వెండితెరపై రాబోతోంది. ‘దొరసాని’ పేరుతో ఆ సినిమా రూపొందనున్నది.

టైటిల్ రోల్‌ను శివాత్మిక పోషించే ఈ సినిమాకి షార్ట్ ఫిలింస్‌తో పేరు తెచ్చుకున్న కె.వి.ఆర్. మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మధుర శ్రీధర్‌రెడ్డి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ పంపిణీ చేయనున్నది. శివాత్మిక పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు.

“తొలిసారి నిన్ను కలిసినప్పుడు ‘దొరసాని’ పాత్రలో నువ్వు గొప్పగా ఉంటావనిపించింది. నా అదృష్టం ఫలించింది. ‘దొరసాని’ నువ్వే” అని ట్వీట్ చేశాడు మహేంద్ర. నిజ జీవితాల ప్రేరణతో రూపొందించిన స్క్రిప్టుతో ఈ సినిమాని అతను తీస్తున్నాడు.

ప్రశాంత్ విహారి సంగీతం, సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందిస్తున్నారు.

రాజశేఖర్ చిన్నకూతురు ‘దొరసాని’! | actioncutok.com

You may also like: