‘జెర్సీ’ యు.ఎస్. బాక్సాఫీస్: నాని ఆరో మిలియన్ డాలర్ల మూవీ!


'జెర్సీ' యు.ఎస్. బాక్సాఫీస్: నాని ఆరో మిలియన్ డాలర్ల మూవీ!

‘జెర్సీ’ యు.ఎస్. బాక్సాఫీస్: నాని ఆరో మిలియన్ డాలర్ల మూవీ!

యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద నాని మరో రికార్డు సృష్టించాడు. మిలియన్ డాలర్లు ఆర్జించిన ఆరు సినిమాల మీడియం బడ్జెట్ హీరోగా నిలిచాడు. అతని తాజా చిత్రం ‘జెర్సీ’ యు.ఎస్.లో మంగళవారం నాటికి మిలియన్ డాలర్ల మార్కును దాటేసింది.

అగ్ర హీరోలు సహా ఈ ఫీట్ సాధించిన తెలుగు హీరోల్లో నాని మూడోవాడు. ఇదివరకు ఈ రికార్డు మహేశ్, జూనియర్ ఎన్టీఆర్‌కు మాత్రమే ఉంది. మహేశ్ అత్యధికంగా 8 మిలియన్ డాలర్ల సినిమాలతో అగ్ర స్థానంలో ఉండగా, జూనియర్ ఎన్టీఆర్, నాని ఆరేసి సినిమాలతో రెండో స్థానంలో ఉన్నారు.

యు.ఎస్.లోని తెలుగు ప్రేక్షకుల్లో నాని ఇమేజ్ ఏ రీతిలో పెరుగుతూ వస్తున్నదో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా నటించిన ‘జెర్సీ’ని గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేశాడు. కాగా ‘జెర్సీ’ థియేటర్లను ఏప్రిల్ 26న ‘అవెంజర్స్: ఎండ్ గేం’ ఆక్రమించుకుంటున్నందున అది 1.5 మిలియన్ డాలర్లను సాధించడం కష్టమే.

అమెరికాలో ‘జెర్సీ’ వసూళ్లు:

గురువారం – $141k
శుక్రవారం – $262k
శనివారం – $325k
ఆదివారం – $179k
సోమవారం – $43k
మంగళవారం – $55k
మొత్తం – $1.005 మిలియన్

నాని మిలియన్ డాలర్ల సినిమాలు:

ఈగ, భలే భలే మగాడివోయ్, నేను లోకల్, నిన్ను కోరి, మిడిల్ క్లాస్ అబ్బాయి, జెర్సీ

‘జెర్సీ’ యు.ఎస్. బాక్సాఫీస్: నాని ఆరో మిలియన్ డాలర్ల మూవీ! | actioncutok.com

You may also like: