జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం!


జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం!

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం!

జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైందా? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ముందు సీసీటీవీ కెమెరాకు చిక్కిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కారులోంచి దిగిన జూనియర్ కుడి ముంజేతికి బ్యాండేజ్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే చేతికి అయిన గాయమేంటో వెల్లడి కాలేదు. మణికట్టు నుంచి కాస్త పైవరకూ ఆ బ్యాండేజ్ కనిపిస్తుండటాన్ని బట్టి ఆ ప్రాంతంలో చేతికి దెబ్బ తగిలిందని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితమే ఎక్సర్‌సైజులు చేస్తూ రాంచరణ్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో ‘ఆర్ ఆర్ ఆర్’లో అతనికి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ వాయిదా పడింది. ఈ నెలాఖరుకు పూనా షెడ్యూల్ మొదలు కావాల్సి ఉండగా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డం దర్శక నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్‌కు గాయం! | actioncutok.com

You may also like: