ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్!


ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్!

ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్!

‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషి కభీ ఘమ్’, ‘దోస్తానా’ వంటి బ్లాక్‌బాస్టర్ హిట్స్ అందించిన ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కరణ్ జోహార్ తన కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌ను చవి చూడబోతున్నాడు. ఇప్పటివరకూ కరణ్ నిర్మించిన సినిమాలన్నింటి కంటే అత్యంత భారీగా, ఏకంగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణమైన ‘కళంక్’ సినిమా అతి పెద్ద డిజాస్టర్ కాబోతోంది.

ఓపెనింగ్స్ గొప్పగా ఉన్నప్పటికీ, విమర్శకులు ఆకాశానికెత్తేసినప్పటికీ, ప్రేక్షకు మరో విధంగా తలచారని రోజు రోజుకూ దిగజారుతున్న వసూళ్లు తెలియజేస్తున్నాయి. పరిస్థితి ఎలా ఉందంటే ‘కళంక్’ను మరో ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’తో పోలుస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. థియేటర్లలో సినిమా పూర్తవకుండానే జనం లేచి వెళ్లిపోతున్నారు. కథ, పాత్రలు, డైలాగులతో ప్రేక్షకులు కనెక్ట్ కావట్లేదని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.

ఈ సినిమాలో వరుణ్ ధావన్, అలియా భట్, ఆదిత్యరాయ్ కపూర్, సోనాక్షి సిన్హా, సంజయ్ దత్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని ఆశించిన ఆదిత్యరాయ్, సోనాక్షిలకు ఆశాభంగం ఎదురైనట్లే. ఇతర సినిమాలతో సక్సెస్‌లు అందుకున్న వరుణ్ ధావన్, అలియాకు పెద్ద నష్టమేమీ లేదు. డైరెక్టర్ అభిషేక్ వర్మన్ కెరీర్‌కూ ఈ సినిమా దెబ్బే.

ఈ సినిమాని ఫాక్స్ స్టార్‌కు అమ్మేశాడు కాబట్టి కరణ్‌కు పోయేదేమీ లేదు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్స్ సాధిస్తూ వస్తోన్న ఫాక్స్ స్టార్‌కు ‘కళంక్’తో భారీ నష్టాలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్! | actioncutok.com

You may also like: