‘కల్కి’ హక్కులు పది కోట్లు!


'కల్కి' హక్కులు పది కోట్లు!

‘కల్కి’ హక్కులు పది కోట్లు!

రాజశేఖర్ హీరోగా నటిస్తోన్న ‘కల్కి’ సినిమాకు అనూహ్యమైన రీతిలో బిజినెస్ వర్గాల నుంచి స్పందన వస్తోంది. సాధారణంగా రాజశేఖర్ సినిమా అంటే డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తి చూపట్లేదు. కానీ ‘పీఎస్‌వీ గరుడవేగ’ హిట్టయ్యాక పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.

‘అ!’ ఫేం ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న ‘కల్కి’ టైటిల్ లోగో విడుదలయ్యాక ఆ సినిమాపై అందరిలోనూ కొద్దో గొప్పో ఆసక్తి మొదలైంది. ‘టీజర్’ విడుదలతో అది రెట్టింపైంది. అప్పట్నుంచీ బిజినెస్ వర్గాలు ఆ సినిమా థియేటర్ హక్కుల కోసం నిర్మాతలు సి. కల్యాణ్, జీవితలను సంప్రదించడం మొదలుపెట్టారు.

మొత్తానికి ఒక సీనియర్ నిర్మాత ‘కల్కి’ థియేటర్ హక్కుల్ని చేజిక్కించుకున్నారు. ఆయన కె.కె. రాధామోహన్. ‘ఏమైంది ఈవేళ’, ‘బెంగాల్ టైగర్’, ‘పంతం’ వంటి సినిమాల్ని నిర్మించిన రాధామోహన్ రెండు తెలుగు రాష్ట్రాల ‘కల్కి’ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని రూ. 10 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.

అదా శర్మ, నందితా శ్వేత నాయికలుగా నటిస్తున్న ఈ సినిమా మేలో విడుదలకు సిద్ధమవుతోంది.

‘కల్కి’ హక్కులు పది కోట్లు! | actioncutok.com

Trending now: