లారెన్స్ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు!

లారెన్స్ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు!
రాఘవ లారెన్స్ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం కాంచన-3. ఈ చిత్రం ఇటీవలే విడుదలై అనూహ్య విజయాన్ని సాధిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో భారీ వసూళ్లని సాధిస్తోంది. అయితే ఈ చిత్రంలో లారెన్స్‌కు జోడీగా నటించి రష్యన్ మోడల్, నటి రి డిజావి అలెగ్జాండర్ తనని ఓ నటుడు లైంగికంగా వేధింపులకు గురిచేస్తుంన్నాడంటూ చెన్నై పోలీసుల్ని ఆశ్రయించడం కలకలం రేపుతోంది.
గత కొంత కాలంగా తన కోరిక తీర్చమంటూ 26 ఏళ్ల రూపేష్ కుమార్ తనని వేధిస్తున్నాడంటూ సదరు హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ పలు చిత్రమైన భంగిమల్లో తనపై ఫొటో షూట్ ని నిర్వహించాడని, తర్వాత ఆ ఫొటోలని వాట్సాప్ చేసి తన కోరికని తీర్చకపోతే వాటిని ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రి డిజావిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తి పొన్నియమ్మన్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. త్వరలో అతన్ని అరెస్ట్ చేయనున్నారని చెన్నై సినీ వర్గాలు తెలిపాయి.
లారెన్స్ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు! | actioncutok.com
You may also like: