1400 మంది డాన్సర్లు.. రూ. 1.30 కోటి బడ్జెట్.. ఒక పాట!


1400 మంది డాన్సర్లు.. రూ. 1.30 కోటి బడ్జెట్.. ఒక పాట!

1400 మంది డాన్సర్లు.. రూ. 1.30 కోటి బడ్జెట్.. ఒక పాట!

‘కాంచన’ సిరీస్‌లో భాగంగా, స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ రాఘ‌వ లారెన్స్ రూపొందించిన హారర్ కామెడీ చిత్రం ‘కాంచ‌న‌ 3’. ఈ చిత్రాన్ని తెలుగులో బి. మ‌ధు (ఠాగూర్ మధు) విడుదల చేస్తున్నారు. రాఘ‌వేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బేనర్‌పై రాఘ‌వ ఈ సినిమా నిర్మించారు.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో  ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుద‌ల చేస్తున్నారు. మునుపటి సినిమాలకు మించిన రీతిలో ‘కాంచన 3’లో చాలా థ్రిల్స్ ఉండబోతున్నాయి. ఒక పాటను దాదాపు 1400 మంది డాన్సర్లతో, రూ. 1.30 కోట్ల ఖర్చుతో చిత్రీకరించడం విశేషం.

నిర్మాత బి. మధు  మాట్లాడుతూ “ఈ చిత్రంలో హీరో అండ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ తన నట విశ్వరూపం చూపించాడు. దాదాపు 1400 మంది డాన్సర్స్ తో మాస్టర్ అత్యద్భుతంగా ఒక పాటని షూట్ చేశారు. 400 మంది అఘోరా గెటప్స్‌తో, 1000 మంది డిఫరెంట్ లుక్‌తో 6 రోజుల పాటు ఈ పాటను తీశారు.

లారెన్స్ కెరీర్‌కి ‘కాంచన 3’ చాలా ప్రత్యేకమైంది. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు. కథ, కథనం, గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేలా ఉంటాయి. ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ మీద చూడని గొప్ప విషయాల్ని మీరు ఈ నెల 19న  తెలుగు, తమిళ భాషల్లో చూస్తారు” అని చెప్పారు.

వేదిక, ఓవియా, కోవై సరళ, సూరి, నిక్కీ తంబోలి, కిశోర్, కబీర్ దుహాన్ సింగ్, నెడుముడి వేణు, శ్రీమాన్, దేవదర్శిని, మనోబాల తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్., సినిమాటోగ్రఫీ: వెట్రి, సుశీల్ చౌధరి.

1400 మంది డాన్సర్లు.. రూ. 1.30 కోటి బడ్జెట్.. ఒక పాట! \ actioncutok.com

You may also like: