‘గుణ 369’గా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో


'గుణ 369'గా 'ఆర్ ఎక్స్ 100' హీరో

‘గుణ 369’గా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న కార్తికేయ త్వరలో ‘గుణ 369’గా కనిపించబోతున్నాడు. అతను హీరోగా స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి ఆ టైటిల్ పెట్టారు. ఈ సినిమాతో అర్జున్ జంధ్యాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా తొలి షెడ్యూలును ఒంగోలులో నిర్వహించారు. రెండో షెడ్యూల్‌ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి మే 15 వరకు తిరిగి ఒంగోలులో షూటింగ్ జరుపుతారు. దాంతో ఒక పాట తప్ప మిగతా సినిమా పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. రెండు పాటల్ని క్రొయేషియాలో చిత్రీకరించారు.

“గుణ 369 అనేది హై ఇంటెన్స్ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా. నా సమ్మర్ లుక్‌ను మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నా. ఇందులో నా పేరు గుణ. 369 అంటే ఏమిటో తెలుసుకోడానికి కొన్ని రోజులు ఆగండి, లేదా ఊహించండి..” అని ట్వీట్ చేశాడు కార్తికేయ.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: చైతన్య భరద్వాజ్‌, సినిమాటోగ్రాఫర్: ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ రామ్, ఆర్ట్‌ డైరెక్టర్‌ : జీయమ్‌ శేఖర్, ఎడిటర్ : తమ్మిరాజు, డాన్స్: రఘు, ఫైట్స్ : రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివ మల్లాల.

‘గుణ 369’గా ‘ఆర్ ఎక్స్ 100’ హీరో |  actioncutok.com

You may also like: