‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆశలు ఆవిరి!

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆశలు ఆవిరి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేళ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను విడుదల చేయాలని ఎంతగానో తపించిన ఆ చిత్ర దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాతల ఆశలు ఆవిరయ్యాయి. ప్రధాని నరేంద్ర మోది బయోపిక్‌గా తయారైన ‘పిఎం నరేంద్ర మోది’తో పాటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, కేసీఆర్ బయోపిక్ ‘ఉద్యమ సింహం’ సినిమాలను మే 19 వరకు విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అయితే వీటిలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఇప్పటికే తెలంగాణతో పాటు యు.ఎస్.లోనూ విడుదలవడం గమనార్హం. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌లో మే 19 తర్వాతే ఆ సినిమాని విడుదల చేసుకోవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
కాగా మంగళవారమే రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ పేజీ ద్వారా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను ఈ వారమే ఆంధ్రప్రదేశ్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఎన్నికల సంఘం ఆయన ఆశలపై నీళ్లు కుమ్మరించినట్లయింది.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఆశలు ఆవిరి! | actioncutok.com
You may also like: