“ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రల్ని చూడండి”


"ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రల్ని చూడండి"

“ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రల్ని చూడండి”

రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజు సంయుక్తంగా డైరెక్ట్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా ఎట్టకేలకు మే 1న ఆంధ్రప్రదేశ్‌లో విడుదలవుతోంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ పేజీ ద్వారా రాంగోపాల్ వర్మ తెలిపారు.

“చివరికి ఆంధ్రప్రదేశ్‌లో మే 1న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలవుతోంది. రండి.. ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రల్ని తిలకించండి” అని ఆయన పోస్ట్ చేశారు. దాంతో పాటు సినిమా పోస్టర్‌నూ ఆయన జోడించారు. అందులో “యన్.టి.ఆర్ అనుభవించిన నరకం” అనే కాప్షన్ ఉపయోగించారు. పోస్టర్‌పై ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు పాత్రధారులు దర్శనమిస్తున్నారు.

నిజానికి దేశంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే మే 19 వరకూ ఏ రాజకీయ నాయకుడి బయోపిక్‌లను కానీ, రాజకీయ చిత్రాలను కానీ విడుదలకు అనుమతించమని ఎన్నికల కమిషన్ ఇదివరకు పేర్కొంది. అందులో భాగంగానే ‘పీఎం నరేంద్ర మోదీ’, ‘ఉద్యమ సింహం’ (కేసీఆర్ బయోపిక్), ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాల విడుదలను నిలిపివేసింది. అయితే అప్పటికే తెలంగాణలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలైపోయింది.

ఇప్పుడు మే 1న ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకు ఎన్నికల కమిషన్ అనుమతించిందా, లేదా అనే విషయం వెల్లడి కావాల్సి ఉంది.

“ఎన్టీఆర్ వెనుక జరిగిన కుట్రల్ని చూడండి” | actioncutok.com

You may also like: