ఆ ఏరియాల్లో ‘మహర్షి’ని నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారు!


ఆ ఏరియాల్లో 'మహర్షి'ని నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారు!

ఆ ఏరియాల్లో ‘మహర్షి’ని నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారు!

మహేశ్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందిస్తోన్న ‘మహర్షి’ చిత్రం అంచనాలకు తగ్గట్లే భారీ ధరలకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మహేశ్ సినిమాల్లో వరుసగా ‘స్పైడర్’, ‘భరత్ అనే నేను’ తర్వాత ‘మహర్షి’ సైతం రూ. 90 కోట్లకు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ కావడం గమనార్హం. కాకపోతే ఆ రెండింటి కంటే కాస్త తక్కువగా దీనికి బిజినెస్ జరిగింది.

కాగా నాలుగు ఏరియాల్లో ‘మహర్షి’ని నిర్మాతలే విడుదల చేస్తున్నారని సమాచారం. ఎప్పటిలా తెలంగాణ, వైజాగ్ ఏరియాల్లో దిల్ రాజు ఈ సినిమాని సొంతంగా విడుదల చేస్తుండగా, కృష్ణా, గుంటూరు ఏరియాల్లో నిర్మాత సి. అశ్వినీదత్ రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ హక్కులు రూ. 12.5 కోట్లతో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా ‘మహర్షి’ ప్రి రిలీజ్ బిజినెస్ విలువ రూ. 94 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

మహేశ్ సరసన పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ సినిమా మే 9న అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది.cu

ఆ ఏరియాల్లో ‘మహర్షి’ని నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారు! \ actioncutok.com

You may also like: