మహేశ్ 26 టైటిల్ ‘సరిలేరు నీకెవ్వరూ’?


మహేశ్ 26 టైటిల్ 'సరిలేరు నీకెవ్వరూ'?
Mahesh

మహేశ్ 26 టైటిల్ ‘సరిలేరు నీకెవ్వరూ’?

‘మహర్షి’ సినిమా విడుదల కోసం సిద్ధమవుతున్న మహేశ్, దాని తర్వాత తన 26వ సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసే ఆ యాక్షన్ కామెడీలో జగపతిబాబు విలన్‌గా నటిస్తున్నట్లు సమాచారం. ‘శ్రీమంతుడు’ సినిమాలో తండ్రీ కొడుకులుగా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆ ఇద్దరూ ఈసారి ఫైట్లు చేసుకుంటుంటే ఎలా ఉంటుందో చూడాలి.

ఈ సినిమాలో జగపతి పాత్ర కామెడీ విలన్ తరహాలో ఉంటుందని వినిపిస్తోంది. ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ అనీ, మహేశ్, జగపతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా అలరించేలా అనిల్ తీర్చిదిద్దాడనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

కాగా ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ‘ఒక్కడు’, ‘దూకుడు’ సినిమాల్లో కేరెక్టర్ పేరు మాదిరిగానే ఇందులోనూ అజయ్ అనే కేరెక్టర్‌ను చేయనున్నట్లు తెలిసింది.

రష్మికా మండన్న నాయికగా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర చేస్తున్నారు. మేలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానున్నది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

మహేశ్ 26 టైటిల్ ‘సరిలేరు నీకెవ్వరూ’? actioncutok.com

You may also like: