యూరప్‌లో ఫ్యామిలీతో జాలీగా…


యూరప్‌లో ఫ్యామిలీతో జాలీగా...

యూరప్‌లో ఫ్యామిలీతో జాలీగా…

‘మహర్షి’ సినిమా షూటింగ్ పూర్తయిపోవడంతో కుటుంబంతో కలిసి యూరప్‌కు విహార యాత్రకు వెళ్లాడు మహేశ్. ఆ సందర్భంగా సుందర నగరం పారిస్‌లో భార్య నమ్రత, కుమారుడు గౌతమ్ కృష్ణతో కలిసి ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశాడు.

“యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్” అనే క్యాప్షన్‌తో పాటు “ఫ్యామిలీ టైమ్” అనే హ్యాష్‌టాగ్‌నూ జోడించాడు. కూతురు సితార మాత్రం ఈ ఫొటోలో లేదు. ఎప్పటివరకు మహేశ్ ఫ్యామిలీ ఈ యూరప్ ట్రిప్‌లో ఉంటారనేది వెల్లడి కాలేదు.

మరోవైపు అంబరాన్నంటుతున్న అంచనాల మధ్య ‘మహర్షి’ మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చెయ్యగా, శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమా కలిసి నిర్మించాయి.

మహేశ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవడంతో పాటు, ఈ ఏడాది ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో టాప్ గ్రాసర్‌గా నిలిచే అవకాశాలు ‘మహర్షి’ కి పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

View this post on Instagram

An evening in Paris ♥ #familytime

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on

యూరప్‌లో ఫ్యామిలీతో జాలీగా… | actioncutok.com

You may also like: