సూపర్ హిట్ దిశగా ‘మజిలీ’ వసూళ్లు!


సూపర్ హిట్ దిశగా 'మజిలీ' వసూళ్లు!

సూపర్ హిట్ దిశగా ‘మజిలీ’ వసూళ్లు!

నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ చిత్రం ఇటు విమర్శకుల ప్రశమల్ని అందుకోవడంతో పాటు అటు ప్రేక్షకుల ఆదరణనీ అమితంగా పొందుతోంది. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 17 కోట్ల (షేర్) మార్కును దాటిన ఆ సినిమా సూపర్ హిట్ రేంజిని అందుకొనే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ మరో నాయికగా నటించింది. షైన్ స్క్రీన్స్ బేనర్‌పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుకంగా నిర్మించిన ఈ సినిమా తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 17.35 కోట్ల షేర్ వసూలు చేసిందనేది అధికారిక సమాచారం.

తెలంగాణలో రూ. 5.35 కోట్ల షేర్ వసూలు చేసిన ‘మజిలీ’, రాయలసీమలో రూ. 1.77 కోట్లను రాబట్టింది. ఇక ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమా రూ. 6.13 కోట్ల షేర్ వసూలు చేసింది. వెరసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘మజిలీ’ సాధించిన వసూళ్లు రూ. 13.25 కోట్లు (షేర్).

మిగతా ప్రాంతాల్లో చూస్తే.. కర్ణాటకలో రూ. 1.15 కోట్లు రాబట్టిన ఈ సినిమా దేశంలోని మిగతా ప్రాంతాల్లో రూ. 70 లక్షలు వసూలు చేసింది. యు.ఎస్.‌లో 2.25 కోట్లను రాబట్టింది. అంటే మూడు రోజుల్లో ‘మజిలీ’ ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 17.35 కోట్లు.

ప్రస్తుత ట్రెండును బట్టి చూస్తే మరో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేకీవెన్ సాధించే అవకాశాలున్నాయి. చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ‘మజిలీ’తో ఊరట లభించింది.

సూపర్ హిట్ దిశగా ‘మజిలీ’ వసూళ్లు! | actioncutok.com

You may also like: