తిరుమల స్వామి సేవలో చైతన్య-సమంత దంపతులు


తిరుమల స్వామి సేవలో చైతన్య-సమంత దంపతులు

తిరుమల స్వామి సేవలో చైతన్య-సమంత దంపతులు

తిరుమల శ్రీ వేంకటేశ్వరసామిని అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయాన్నే వీఐపీ దర్శన సమయం ప్రారంభం కాగానే వారు స్వామి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో నాగచైతన్య దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

‘మజిలీ’ సినిమా ఈ నెల 5న (శుక్రవారం) విడుదల కానుండటంతో ఆ సినిమాకు ఆశీర్వాదాలు కోరుతూ ఆ దంపతులు ఏడుకొండలవాడి దర్శనం చేసుకున్నారు. వీరితో పాటు సీనియర్ హాస్యనటుడు బ్రహ్మానందం కూడా స్వామివారిని దర్శించుకున్నారు. తనను ఫొటో తీస్తున్న వాళ్లకు ఆయన ఆనందంగా పోజులిచ్చారు. అంతకుముందు అలిపిరి నుంచి కాలినడకన సమంత తిరుమలకు చేరుకోవడం గమనార్హం.

తిరుమల స్వామి సేవలో చైతన్య-సమంత దంపతులు | actioncutok.com

You may also like: