నాగబాబు.. జబర్దస్త్.. విడదీయలేని బంధం!


నాగబాబు.. జబర్దస్త్.. విడదీయలేని బంధం!
Nagababu

నాగబాబు.. జబర్దస్త్.. విడదీయలేని బంధం!

నాగబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు. తమ్ముడు పవన్ కల్యాణ్ నెలకొల్పిన జనసేన పార్టీలో చేరి నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేశారు. ఫలితం మే 23న తేలడంతో పాటు నాగబాబు రాజకీయ భవితవ్యం కూడా తేలుతుందని అనుకోవడం సహజం.

అయితే నాగబాబు మాత్రం ఎన్నికల ఫలితంతో నిమిత్తం లేకుండా హాయిగా ‘జబర్దస్త్’ షోని ఎప్పటిలా ఆస్వాదిస్తున్నారు. ఎన్నికల్లో నాగబాబు గెలిస్తే ‘జబర్దస్త్’ షో పరిస్థితేమిటి? జనసేన వాణిని వినిపించడానికి తరచూ ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది కదా? అప్పుడు ‘జబర్దస్త్’ షూటింగ్‌లో పాల్గొనడానికి ఆయనకు వీలవదు కదా? అంటే ‘జబర్దస్త్’ను నాగబాబు వదిలేస్తారా?

ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులకు వచ్చేస్తున్నాయి. వీటిని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు కూడా. అయితే సినీ నిర్మాతగా ఆస్తులన్నీ పోగొట్టుకొని అప్పులపాలైన ఆయనకు ‘జబర్దస్త్’ షో ఒక ఆలంబన నిచ్చింది. అంతేకాదు.. ఆ షోతో టీవీ వీక్షకులతో ఆయనకు గట్టి బంధం ఏర్పడిపోయింది. అందువల్ల ‘జబర్దస్త్’ను విడిచిపెట్టనని నాగబాబు తేల్చి చెప్పేశారు.

ఎంపీగా గెలిచినా ‘జబర్దస్త్’ను వదలననీ, ఆ షో కోసం తన పనుల్ని సర్దుబాటు చేసుకుంటానని నాగబాబు తన ఉద్దేశాన్ని చెప్పారు. ఆ షోలో ఆయనతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న రోజా ఎమ్మెల్యే పదవిలో ఉంటూనే షోలో పాల్గొంటూ వచ్చారు. అదే తరహాలో మరికొంత మంది కూడా రాజకీయ పదవుల్లో ఉంటూ టీవీ షోలు చేస్తున్నారనీ, తను కూడా అదే దారిలో వెళ్తాననీ నాగబాబు స్పష్టం చేశారు.

నాగబాబు.. జబర్దస్త్.. విడదీయలేని బంధం! | actioncutok.com

You may also like: