‘వి’ అంటే విలన్ అని చెప్పేశాడు!


'వి' అంటే విలన్ అని చెప్పేశాడు!

‘వి’ అంటే విలన్ అని చెప్పేశాడు!

నానిసోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో నాని ఉన్నాడా? లేడా? అంటూ అనేకమంది ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

దాంతో గంటల వ్యవధిలోనే సస్పెన్స్‌కు తెరదించుతూ నాని బయటకొచ్చాడు. ‘వి’లో తాను విలన్‌గా చేస్తున్నానంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘వి’ నానికి 25వ చిత్రం కావడం విశేషం. హీరోగా చేస్తూ మైలురాయి లాంటి 25వ చిత్రంలో విలన్‌గా చేస్తుండటం నటుడిగా నాని విలక్షణత్వాన్ని తెలియజేస్తోంది.

“ఆయన నన్ను నా తొలి సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళ నా 25వ సినిమాలో మరోసారి నన్ను పరిచయం చెయ్యడానికి సిద్ధమవుతున్నాడు. కానీ.. ఈసారి.. ఇది భిన్నం.. యువర్ ఫ్రెండ్లీ నైబర్‌హుడ్ ‘బ్యాడ్ యాస్’ జాయిన్స్ ద పార్టీ. ‘వి’ మూవీ” అని ట్వీట్ చేశాడు నాని.

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అదితిరావ్ హైదరి నాయికలుగా నటిస్తున్నారు.

‘వి’ అంటే విలన్ అని చెప్పేశాడు!| actioncutok.com

Trending now: