నేష‌న‌ల్ అవార్డ్స్‌: రేసులో ‘మహానటి’, ‘రంగస్థలం’


నేష‌న‌ల్ అవార్డ్స్‌: రేసులో 'మహానటి', 'రంగస్థలం'

నేష‌న‌ల్ అవార్డ్స్‌: రేసులో ‘మహానటి’, ‘రంగస్థలం’

‘బాహుబ‌లి’ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా తెలుగు సినిమాపై ఫోక‌స్ పెరిగింది. టాలీవుడ్ నుంచి సినిమా వ‌స్తోందంటే దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంటోంది. గ‌త ఏడాది టాలీవుడ్‌లో విడుద‌లైన చిత్రాలు మంచి విజ‌యాల్ని సాధించ‌డంతో పాటు దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించాయి. వాటిలో మహాన‌టి, రంగ‌స్థ‌లం, గీత‌ గోవిందం, కేరాఫ్ కంచ‌ర‌పాలెం, భ‌రత్ అనే నేను చిత్రాలు 66వ జాతీయ పుర‌స్కారాల కోసం పోటీప‌డుతున్నాయి.

అయితే ఈ చిత్రాల్లో ప్ర‌ధాన పోటీ మాత్రం కీర్తి సురేశ్ టైటిల్ రోల్ చేసిన ‘మ‌హాన‌టి’, రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన ‘రంగ‌స్థ‌లం’ చిత్రాల మ‌ధ్యే వుండ‌టం గ‌మ‌నార్హం. ఈ రెండు చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించిన కీర్తి సురేష్ మ‌హాన‌టి సావిత్రి పాత్ర‌లో న‌భూతో న‌భ‌విష్య‌తి త‌ర‌హాలో అబ్బుర‌ప‌రిచే న‌ట‌న‌ను క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. ఈ సినిమా చూసిన వారంతా ఈ ఏడాది జాతీయ ఉత్త‌మ న‌టి పుర‌స్కారం కీర్తి సురేష్‌కే అన్నారు కూడా.

ఇక ‘రంగ‌స్థ‌లం’ చిత్రంలో సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబు పాత్ర‌లో న‌టించి ఆ పాత్ర‌కే ప్రాణం పోశాడు రామ్‌చ‌ర‌ణ్‌. అత‌న్నీ అవార్డు వ‌రించే అవ‌కాశం వుంద‌ని అంతా అన్నారు. ఈ ఇద్ద‌రిలో కీర్తి సురేష్‌కే అవ‌కాశాలు ఎక్కువ‌గా వున్నాయ‌నేది విశ్లేషకుల వాద‌న‌. అయితే ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన వాళ్లెవ‌రూ జాతీయ స్థాయిలో లాబీయింగ్ చేయ‌క‌పోవ‌డం ఆశ్చర్యం కలిగిస్తోంది.

నేష‌న‌ల్ అవార్డ్స్‌: రేసులో ‘మహానటి’, ‘రంగస్థలం’ | actioncutok.com

You may also like: