‘దిమాక్ ఖరాబ్’ చేసిన నిధి!


'దిమాక్ ఖరాబ్' చేసిన నిధి!

‘దిమాక్ ఖరాబ్’ చేసిన నిధి!

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్’ అనేది ఉప శీర్షిక. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బేనర్లపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన సెట్లో “దిమాక్ ఖరాబ్..” అనే పాటను రామ్, నిధి అగర్వాల్, వందమంది డాన్సర్లపై చిత్రీకరిస్తున్నారు. కాసర్ల శ్యామ్ తెలంగాణ యాసలో రాసిన ఈ పాటకు శేఖర్ కొరియోగ్రఫీ సమకూరుస్తున్నారు.

ఈ పాట తీస్తున్నప్పుడే డైరెక్టర్ సుకుమార్ అక్కడికి వచ్చారు. కొత్తగా ఉన్న రామ్ లుక్‌ను, పాట వస్తున్న తీరును ప్రశంసించారు. ఈ సందర్భంగా డాన్సర్లతో కలిసి నిధి డాన్స్ చేస్తున్న స్టిల్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'దిమాక్ ఖరాబ్' చేసిన నిధి!

‘దిమాక్ ఖరాబ్’ చేసిన నిధి! | actioncutok.com

You may also like: