బ్లాక్‌బస్టర్ కాకపోయినా శాటిస్‌ఫ్యాక్షన్ గ్యారంటీ!


బ్లాక్‌బస్టర్ కాకపోయినా శాటిస్‌ఫ్యాక్షన్ గ్యారంటీ!

బ్లాక్‌బస్టర్ కాకపోయినా శాటిస్‌ఫ్యాక్షన్ గ్యారంటీ!

మూడు వరుస ఫ్లాపుల తర్వాత రెండు సినిమాలను ప్రకటించాడు హీరో నితిన్. ఒకటి చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్‌లో.. మరొకటి వెంకీ కుడుముల దర్శకత్వంలో. వీటిలో మొదట ఏలేటి సినిమా సెట్స్‌పైకి వెళ్తోంది. నిజానికి ఈ నెల మధ్యలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని నితిన్ చెప్పినా అది జరగలేదు. హీరోయిన్ ఎంపిక ఆలస్యం కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఇప్పుడు నితిన్ జోడీగా రకుల్‌ప్రీత్‌ని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి కానీ అధికారికంగా ధ్రువపడలేదు. ఆ విషయం అలా ఉంచితే నితిన్‌ను పరాజయాల బాట నుంచి విజయాల బాటలోకి ఏలేటి తీసుకొస్తాడా.. అనే చర్చ మొదలైంది.

2016లో వచ్చిన ‘అ ఆ’ సినిమా తర్వాత మళ్లీ నితిన్‌కు హిట్ రాలేదు. ‘లై’, ‘ఛల్ మోహన్ రంగా’, ‘శ్రీనివాస కల్యాణం’ సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో చివరి సినిమా 2018 ఆగస్టులో విడుదలైంది. అప్పట్నుంచీ నితిన్ మళ్లీ కెమెరా ముందుకు రాలేదు.

కథల విషయంలో మరింత శ్రద్ధ వహిస్తూ ఏలేటికీ, వెంకీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చంద్రశేఖర్ ఏలేటి అనగానే మనకు థ్రిల్లర్స్ గుర్తుకొస్తాయి. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ఒక్కడున్నాడు’, ‘సాహసం’, ‘మనమంతా’ వంటి థ్రిల్లర్లు ఆయన సృజనాత్మకతకు నిదర్శనాలు. ఒక్క ‘ప్రయాణం’ మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఆయనతో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు నితిన్. ఈ థ్రిల్లర్ తనకు విజయాన్ని సాధించిపెడుతుందనే నమ్మకం అతనిలో కనిపిస్తోంది. ఇప్పటివరకూ ఏలేటి నుంచి బ్లాక్‌బస్టర్ మూవీ రాలేదు. అతనివి రెగ్యులర్ కమర్షియల్ స్క్రిప్టులు కావు. అన్నీ దర్శకుడ్ని ఎలివేట్ చేసే స్క్రిప్టులే. నో డౌట్.. టాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన దర్శకుల్లో ఆయన ఒకడు. ఆయనతో చేసే సినిమా బ్లాక్‌బస్టర్ కాకపోయినా నితిన్‌కు మంచి సినిమా చేశాననే తృప్తి మిగలడం ఖాయం.

బ్లాక్‌బస్టర్ కాకపోయినా శాటిస్‌ఫ్యాక్షన్ గ్యారంటీ! | actioncutok.com

You may also like: