దేవుడా! ‘సూపర్ డీలక్స్’ని భరించలేం!


దేవుడా! 'సూపర్ డీలక్స్'ని భరించలేం!

దేవుడా! ‘సూపర్ డీలక్స్’ని భరించలేం!

సమంత, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించగా త్యాగరాజన్ కుమారరాజా డైరెక్ట్ చేసిన తమిళ సినిమా ‘సూపర్ డీలక్స్’ను ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే ఒకతను మాత్రం ఆ సినిమాని భరించడం కష్టమంటున్నాడు. అతను తమిళ నటుడు, సినిమాటోగ్రాఫర్ నటరాజ సుబ్రమణి. ‘సూపర్ డీలక్స్’ లాంటి సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటానని కూడా అంటున్నాడు.

ఆ సినిమాని చూసిన అతను ట్విట్టర్ వేదికగా తన భావాల్ని పంచుకున్నాడు. తమిళంలో చేసిన అతని ట్వీట్స్‌ను తెలుగులోకి అనువదిస్తే వచ్చేది – “జీవితంలో దుఃఖకరమైన, అసహ్యకరమైన ఆరాధించడం, అభినందించడం సరైనదేనా? ఈ రకమైన ప్రమాణాలకు దూరంగా ఉండాలనుకుంటాను. దేవుడా, ‘సూపర్ డీలక్స్’ను భరించలేం.”

నటరాజకు ‘సూపర్ డీలక్స్’తో ఏవైనా సమస్యలుండవచ్చు గాక, కానీ దానిపై అతడు వ్యక్తం చేసిన భావాలు సరైనవి కావని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జీవితంలో కొంతమంది అసాధారణ వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల్ని చూపించే సినిమా ‘సూపర్ డీలక్స్’. గుర్తింపు, శృంగారం, లింగ వివక్ష, హిజ్రాలు, శృంగార తారలు ఎదుర్కొనే కష్టాలు వంటి అంశాల్ని త్యాగరాజన్ కుమారరాజా ఇందులో చూపించాడు.

కార్తీక్ సుబ్బరాజ్, పా. రంజిత్, విక్రమాదిత్య మొత్వానే, సుధీష్ కామత్, అనురాగ్ కశ్యప్ వంటి డైరెక్టర్లు ఈ సినిమాని అమితంగా ప్రశంసించారు.

దేవుడా! ‘సూపర్ డీలక్స్’ని భరించలేం! | actioncutok.com

You may also like: