రూ. 5 కోట్ల ‘అప్పు’ను పవన్ ఎప్పుడు చెల్లిస్తారో?


రూ. 5 కోట్ల 'అప్పు'ను పవన్ ఎప్పుడు చెల్లిస్తారో?
Pawan Kalyan

రూ. 5 కోట్ల ‘అప్పు’ను పవన్ ఎప్పుడు చెల్లిస్తారో?

గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పుడు పవన్ కల్యాణ్ అఫిడవిట్‌లో తన అప్పుల గురించి తెలియజేశారు. అందులో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నుంచి తీసుకున్న అప్పు గురించి కూడా ప్రస్తావించారు.

నిజానికి మైత్రీ మూవీ మేకర్స్ ఆయనకు ఒక సినిమా నిమిత్తం రూ. 5 కోట్ల అడ్వాన్స్ చెల్లించింది. విజయ్ హీరోగా నటించిన తమిళ హిట్ ఫిల్మ్ ‘తెరి’ని ఆయనతో రీమేక్ చెయ్యాలని ఆ సంస్థ ప్లాన్ చేసింది. డైరెక్టర్‌గా సంతోష్ శ్రీనివాస్‌ను ఎంచుకుంది. పవన్ కూడా సరేనన్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత ఆకస్మికంగా పవన్ కల్యాణ్ సినిమాలకు తాత్కాలికంగా స్వస్తి చెప్పి, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేశారు.

దీంతో మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ల ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. పవన్‌కు ఇచ్చిన రూ. 5 కోట్ల అడ్వాన్స్ ఆయన వద్దే నిలిచిపోయింది. అది ఎప్పుడు తిరిగి వస్తుందో తెలీని స్థితి. ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు తిరిగిరావడం వినా వేరే దారి లేదు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. మే 23న ఫలితాలొస్తాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం జనసేనకు 10కి మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అప్పుడు కూడా పవన్ రాజకీయాలకే పూర్తి సమయం కేటాయిస్తారా, తిరిగి సినిమాల్లో నటిస్తారా? అనేది ఆసక్తి కలిగిస్తోన్న అంశం.

రూ. 5 కోట్ల ‘అప్పు’ను పవన్ ఎప్పుడు చెల్లిస్తారో? \ actioncutok.com

You may also like: