మోదీ ఆస్తి రూ. 2.5 కోట్లు!


మోదీ ఆస్తి రూ. 2.5 కోట్లు!
వారణాసిలో నామినేషన్ పత్రాలు సమర్పించడానికి ముందు శిరోమణి అకాలీ దళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ పాదాలకు నమస్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

మోదీ ఆస్తి రూ. 2.5 కోట్లు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ రూ. 2.5 కోట్లు!. అందులో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఒక నివాస స్థలం, రూ. 1.27 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, చేతిలో రూ. 38,750 నగదు ఉన్నాయి. శుక్రవారం ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఆయన అఫిడవిట్‌లోని వివరాలివి.

వారాణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎన్నిక కావాలనుకుంటున్న ప్రధాని, 2014లో తన ఆస్తులు రూ. 1.65 కోట్లని వెల్లడించారు.

తన భార్య పేరు జశోదాబెన్ (యశోదాబెన్) అనీ, తాను 1983లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి ఎంఏ డిగ్రీ పొందాననీ స్పష్టం చేశారు. అఫిడవిట్ ప్రకారం డిల్లీ యూనివర్సిటీలో 1978లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1967లో గుజరాత్ బోర్డ్ నుంచి ఎస్.ఎస్.సి. పాసయ్యారు.

ప్రభుత్వం నుంచి అందుతున్న జీతం, బ్యాంక్ నుంచి వస్తున్న వడ్డీ తన ఆదాయ వనరులుగా మోదీ పేర్కొన్నారు. తన భార్య సంపాదన తెలియదని అఫిడవిట్‌లో తెలిపారు.

మోదీ ఆస్తి రూ. 2.5 కోట్లు! actioncutok.com

You may also like: