తిరుపతిలో పోలీసు నిఘా పెంచారు!


తిరుపతిలో పోలీసు నిఘా పెంచారు!

తిరుపతిలో పోలీసు నిఘా పెంచారు!

ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన భద్రతాపరమైన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని శనివారం తిరుపతి పోలీస్ సూపరింటెండెంట్ కె.కె.ఎన్. అన్బురాజన్ చిత్తూరు జిల్లాలోని అన్ని పట్టణ హద్దుల వ్యాప్తంగా పోలీస్ నిఘాను ఏర్పాటుచేసి, తనిఖీలను ముమ్మరం చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలనైనా నిరోధించడానికి రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, హాస్పిటళ్లు, తిరుమల, తిరుపతి, శ్రీకాళహస్తి, ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భద్రతాపరమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు.

“తిరుపతిని ముప్పు పొంచి ఉన్న ప్రాంతంగా ఇంటలిజెన్స్ బ్యూరో వర్గీకరించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ అవకాశం లేకుండా చెయ్యడానికి అన్ని సున్నిత ప్రదేశాల్లో తనిఖీల నిమిత్తం భద్రతా సిబ్బందిని నియమించాం. టెంపుల్ సిటీలో ఏడాది పొడుగూతా, ప్రత్యేకించి వేసవి కాలంలో భక్తుల రాకపోకలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి, మేం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం” అని చెప్పారు అన్బురాజన్.

ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తిరుపతిలో పోలీసు నిఘా పెంచారు! || actioncutok.com

Trending now: