ఆ హీరోతో రెండోసారి!


ఆ హీరోతో రెండోసారి!
Pooja Hegde

ఆ హీరోతో రెండోసారి!

అందం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉన్న తార పూజా హెగ్డే. ‘రంగస్థలం’లో స్పెషల్ అప్పీరెన్స్ (‘జిగేలు రాణి’ పాట)ను వదిలేస్తే తెలుగులో ఇప్పటి వరకు ఆమె ఆరు సినిమాలను ఆరుగురు హీరోలతో చేసింది.

మొదట నాగచైతన్య జోడీగా ‘ఒక లైలా కోసం’లో కనిపించినా ఆమె.. ఆ తర్వాత ‘ముకుంద’తో హీరోగా పరిచయమైన వరుణ్‌తేజ్ సరసన మెరిసింది. తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి రెండేళ్లకు పైగా ‘మొహెంజో దారో’ కోసం వెచ్చించి, తిరిగి వచ్చి అల్లు అర్జున్ జతగా ‘దువ్వాడ జగన్నాథమ్’ చేసింది. ఆ పైన ‘సాక్ష్యం’లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించింది.

జూనియర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ రూపొందించిన ‘అరవింద సమేత’లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తాజాగా మహేశ్ జోడీగా ‘మహర్షి’ సినిమా పూర్తి చేసింది. ఆ ఇద్దరూ జంటగా ఉన్న స్టిల్స్ ఇప్పటికే క్రేజీగా అనిపిస్తున్నాయి.

ఇలా ఆరు సినిమాల్లో వేర్వేరు హీరోల జోడీగా నటించిన పూజ తొలిగా ఒక హీరోతో రెండోసారి కలిసి నటిస్తుండటం గమనార్హం. ఆ హీరో అల్లు అర్జున్. అంతే కాదు.. అదే సినిమాతో ఒక దర్శకుడితోనూ రెండో సారి పని చేస్తోంది కూడా. ఆ దర్శకుడు త్రివిక్రమ్.

‘దువ్వాడ జగన్నాథమ్’లో బన్నీ, పూజ కెమెస్ట్రీ గొప్పగా పండిందనే పేరొచ్చింది. అందుకే కాబోలు తన సినిమాలో బన్నీకి జోడీగా ఆమెనే ఎంచుకున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమాతో బన్నీ, పూజ జోడీ ఏ రీతిలో అలరిస్తుందో చూడాలి.

ఆ హీరోతో రెండోసారి! | actioncutok.com

You may also like: