చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ: పోసాని


చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ: పోసాని
Posani Krishna Murali

చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ: పోసాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు సర్వత్రా చర్చనీయంశమయ్యాయి. చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువనీ, ఆంధ్రప్రదేశ్‌ను కమ్మ రాజ్యంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారనీ ఆయన ఆరోపించారు.

సోమవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు గతంలో చేసిన వ్యాఖ్యల్ క్లిపింగ్‌ని ఆయన ప్రదర్శించారు. అందులో “ఎవరైనా ఎస్టీల్లో పుట్టాలని అనుకుంటారా? సంపన్న కులాల్లోనో, రాజులుగానో పుట్టాలని అనుకుంటారు” అని ఆ వీడియో క్లిప్పులో చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తే ఎస్టీలుగా పుట్టడం దురదృష్టకరమని చెప్పినట్లు అయ్యింది.

చంద్రబాబు పదే పదే మాటలు మార్చే వ్యక్తని చెప్పిన పోసాని, అందుకు రుజువులుగా ఆయన ఎప్పుడు ఏమేం చెప్పారో ఉదహరించారు.

మొదట సమైక్యాంధ్ర అన్న చంద్రబాబు తర్వాత ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇచ్చారనీ, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని మొదట గట్టిగా మాట్లాడిన ఆయన తర్వాత హోదాతో ఒరిగేదీమీ లేదన్నట్లు మాట్లాడటమే కాకుండా, ప్రత్యేక ప్యాకేజికి సరేనన్నారనీ, మోదీతో సంబంధాలు బెడిసి కొట్టేసరికి మళ్లీ ప్రత్యేక హోదా అంటున్నారనీ పోసాని దుయ్యబట్టారు.

చంద్రబాబుది ఎవరినైనా వాడుకొని వదిలేసే తత్వమంటూ నటీమణులు జయప్రద, రోజా, కవితలను అవసరానికి వాడుకొని వదిలేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు మనస్తత్వం గురించి తన చివరి రోజుల్లో ఎన్టీఆర్ చెప్పిన మాటల వీడియో క్లిప్పింగ్‌ను పోసాని ప్రదర్శించారు.

చంద్రబాబుకు కులపిచ్చి ఎక్కువ: పోసాని | actioncutok.com

You may also like: