ప్రభాస్ తొలి పోస్ట్ పాత సినిమాదే!


ప్రభాస్ తొలి పోస్ట్ పాత సినిమాదే!
Prabhas in Baahubali

ప్రభాస్ తొలి పోస్ట్ పాత సినిమాదే!

ప్రభాస్ మేనియా దేశవ్యాప్తంగా ఎలా ఉందో మరోసారి స్పష్టమైంది. కొద్ది రోజుల క్రితం ఎలాంటి పోస్ట్ పెట్టకుండా ప్రభాస్ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌ను తెరిచిన విషయం తెలిసిందే. అప్పటికప్పుడే 8.5 లక్షల మంది ఆ పేజీని ఫాలో అవడం మొదలుపెట్టారు. అప్పట్నించీ ప్రభాస్ తొలిగా ఏం పోస్ట్ చేస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తూ వచ్చారు.

ఎట్టకేలకు వాళ్ల నిరీక్షణ ఫలించింది. గురువారం తన ఇన్‌స్టాగ్రాం పేజీలో తొలి పోస్ట్‌ను షేర్ చేశాడు ప్రభాస్. అత్యధికులు ‘సాహో’ సినిమాకు సంబంధించిన కొత్త స్టిల్‌ను షేర్ చేస్తాడని ఊహిస్తే, అందుకు భిన్నంగా ఇప్పటికే తను నటించగా, ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’కి చెందిన ఫొటోను షేర్ చేశాడు ప్రభాస్.

అయితే ఆ ఫొటో ఇప్పటివరకు బయటకు రాని పిక్చర్ కావడం గమనార్హం. రెండు కత్తుల్ని ఒకదాని కొకటి అడ్డంగా పెట్టి, ప్రభాస్ తల దించుకొని ఉన్న ఆ ఫొటో ఆకట్టుకొనే రీతిలో ఉంది. ఇప్పటికే ఆ పోస్ట్‌కు 2.98 లక్షల లైక్స్ రావడం విశేషం.

సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్ట్ 15న విడుదల కానున్నది.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas) on

ప్రభాస్ తొలి పోస్ట్ పాత సినిమాదే! | actioncutok.com

You may also like: