ప్రభాస్ రికార్డ్ ఎంట్రీ!


ప్రభాస్ రికార్డ్ ఎంట్రీ!
Prabhas

ప్రభాస్ రికార్డ్ ఎంట్రీ!

‘బాహుబలి’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. శుక్రవారం ఇన్‌స్టాగ్రాం ప్లాట్‌ఫాంలోకి ప్రభాస్ అధికారికంగా అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో 7 లక్షలకు పైగా ఫాలోవర్స్ చేరడం రికార్డు. ఓ సౌంత్ ఇండియన్ స్టార్‌కి ఇన్‌స్టాగ్రాంలో ఇదే రికార్డు. సదర్భవశాత్తూ ప్రభాస్ అధికారిక ఫేస్‌బుక్ పేజీకి పది మిలియన్ల లైక్స్ ఉండడం విశేషం.

ప్రభాస్ ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో బిజీగా ఉన్నాడు. నాలుగు భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కానున్నది. ఇప్పటికే ‘షేడ్స్ ఆఫ్ సాహో’, ‘షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 2’ టీజర్స్ సంచలనం సృష్టించాయి. వీటితో ‘సాహో’పై అంచనాలు అనూహ్య స్థాయిలో పెరిగాయి.

శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోన్న ఈ సినిమాని ‘రన్ రాజా రన్’ ఫేం సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ను ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో తొలి పోస్ట్‌గా షేర్ చేయనున్నాడు

ప్రభాస్ రికార్డ్ ఎంట్రీ! | actioncutok.com

You may also like: