ఒక్క నిమిషం నా కోసం చూడండి!


ఒక్క నిమిషం నా కోసం చూడండి!
Raghu Kunche

ఒక్క నిమిషం నా కోసం చూడండి!

గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచే నిర్మాతగా మారారు. ‘ద్ మిస్టరీ అన్‌ఫోల్డ్స్’ అనేది ట్యాగ్‌లైన్. తొలిగా ’47 డేస్’ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ‘జ్యోతిలక్ష్మి’ ఫేం సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి పూరి జగన్నాథ్ శిష్యుడు ప్రదీప్ మద్దాలి దర్శకుడు.

పూజా జవేరి, రోషిణి ప్రకాశ్ నాయికలు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఇది రూపొందుతోంది. రఘుతో పాటు దబ్బార శశిభూషణ్ నాయుడు, శ్రీధర్ మక్కువ, విజయ్ శంకర్ డొంకాడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బుధవారమే ఈ సినిమా ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసిన రఘు కుంచే “నేను ఒక నిర్మాతగా మారి మొదటిసారి చేసిన సినిమా ట్రైలర్ ఇది. ఒక్క నిమిషం నా కోసం చూస్తారని ఆశిస్తున్నాను” అంటూ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

అధికారికంగా ఈ ట్రైలర్‌ను గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ్, రాజ్ కందుకూరి, ఆర్పీ పట్నాయక్, బీవీఎస్ రవి, సతీశ్ కాశెట్టి, కత్తి మహేశ్, వెంకటేశ్ మహా, లక్ష్మీ భూపాల్, భాస్కరభట్ల తదితరులు పాల్గొన్నారు.

రఘు కుంచే సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్, విశ్వ, ప్రీతి కేశవన్ పాటలు రాశారు.

ఒక్క నిమిషం నా కోసం చూడండి! | actioncutok.com

You may also like: