‘దర్బార్’లో రజనీ బ్యాటింగ్!


'దర్బార్'లో రజనీ బ్యాటింగ్!

‘దర్బార్’లో రజనీ బ్యాటింగ్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ముంబైలో జరుగుతున్న ‘దర్బార్’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. నయనతార నాయికగా నటిస్తోన్న ఈ సినిమా గేట్‌వే ఆఫ్ ఇండియా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాలో నివేదా థామస్ ఒక కీలక పాత్ర చేస్తోంది. తాజాగా రజనీకాంత్, నయనతార, నివేదా, కమెడియన్ యోగిబాబు క్రికెట్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఒక దాని తర్వాత ఒకటిగా సెట్స్ నుంచి లీకవుతున్న ఫొటోలు నిర్మాతలకు తలనొప్పిగా పరిణమిస్తుంటే, రజనీ అభిమానులకు సంబరాన్ని కలిగిస్తున్నాయి. ఒక ఫొటోలో రజనీకాంత్ బ్యాటింగ్ చేస్తుండగా, పక్కనే పింక్ అండ్ వైట్ శారీలో ఉన్న నయనతార నిల్చొని చూస్తోంది. యోగిబాబు వికెట్ కీపింగ్ చేస్తున్నాడు.

ఇంకో ఫొటోలో నలుగురు తారలూ వికెట్ల దగ్గర నిల్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతకీ వాళ్లు క్రికెట్ ఆడుతోంది షాట్ గ్యాప్‌లోనా, లేక సినిమాలో సన్నివేశం కోసమా? అనేది వెల్లడి కాలేదు. అంతర్జాలంలో ఈ రెండు రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి.

'దర్బార్'లో రజనీ బ్యాటింగ్!

చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్ కేరెక్టర్‌లో కనిపించబోతున్నారు. ‘దర్బార్’ రజనీ, మురుగదాస్ కాంబినేషన్‌లో తయారవుతున్న తొలి సినిమా. ‘చంద్రముఖి’ తర్వాత రజనీ, నయనతార పూర్తి స్థాయిలో జంటగా నటిస్తోన్న సినిమా. అలాగే ‘పేట’ తర్వాత వెంటనే రజనీ సినిమాకి సంగీతం అందించే అవకాశం సంపాదించుకున్నాడు అనిరుధ్ రవిచందర్. 2020 పొంగల్‌కి ఈ సినిమా విడుదల కానున్నది.

'దర్బార్'లో రజనీ బ్యాటింగ్!

‘దర్బార్’లో రజనీ బ్యాటింగ్! | actioncutok.com

You may also like: