నటుడిగా అవతారమెత్తిన రాంగోపాల్ వర్మ!


నటుడిగా అవతారమెత్తిన రాంగోపాల్ వర్మ!

నటుడిగా అవతారమెత్తిన రాంగోపాల్ వర్మ!

దర్శకుడిగా పరిచయమై, తర్వాత నిర్మాతగా, రచయితగా, గాయకుడిగా తనలోని పార్శ్వాలను బయటపెట్తిన రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తి స్థాయి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందులోనూ ‘ఆర్’ అనే ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఆ సినిమా పేరు ‘కోబ్రా’.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తరహాలోనే ఈ సినిమానీ అగస్త్య మంజుతో కలిసి ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో క్రిమినల్‌గా ‘కె.జి.’, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌గా రంగారావు నటిస్తున్నారు. “ఎ బయోపిక్ ఆఫ్ ద మోస్ట్ డెంజరస్ క్రిమినల్ ఎవర్” అని ఈ సినిమాని వర్మ పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు వర్మ.

కేసీఆర్ పాత్ర కూడా ఉన్నదంటే ఇది తెలంగాణా ప్రాంతానికి చెందిన ఒక పేరుపొందిన నేరగాడి కథగా తెలుస్తోంది.

నటుడిగా అవతారమెత్తిన రాంగోపాల్ వర్మ! | actioncutok.com

You may also like: