గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘బాహుబలి’ విలన్


గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'బాహుబలి' విలన్
Rana at airport

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘బాహుబలి’ విలన్

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రానా కనిపించిన తీరు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. కొంతమంది తెలిసినవాళ్లు కూడా అతడ్ని గుర్తుపట్టలేకపోయారు. పొడవాటి గడ్డం, బక్కపలుచని శరీరంతో అతడు పూర్తిగా మారిపోయాడు.

కొంత కాలంగా పాత్రలకు తగ్గట్లు ఆహార్యాన్ని మార్చుకుంటూ వస్తున్న రానా ‘బాహుబలి’ సినిమాలో కండలరాయుడిగా, బాగా బరువు పెరిగి కనిపించాడు. ఆ తర్వాత క్రిష్ డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ బయోపిక్‌లో చంద్రబాబునాయుడి పాత్ర కోసం బాగా బరువు తగ్గి సన్నగా మారిపోయాడు.

ఇప్పుడు మరింత బరువు తగ్గి మరీ పీలగా, దాదాపు పేషెంట్‌లా కనిపిస్తున్నాడు. ఇటీవలే అతడు హిందీలో ‘హాథీ మేరే సాథీ’ సినిమా పూర్తిచేశాడు. అతి త్వరలో వేణు ఊడుగుల సినిమా ‘విరాట పర్వం 1992’ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పాత్ర కోసమే అతడు ఇంత సన్నగా తయారయ్యాడని తెలుస్తోంది. మొత్తానికి తన కొత్త లుక్‌తో అందర్నీ షాక్‌కు గురి చేస్తున్నాడు రానా.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'బాహుబలి' విలన్

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘బాహుబలి’ విలన్ | actioncutok.com

You may also like: