అందుకే ముద్దు సీన్లు చెయ్యను!


అందుకే ముద్దు సీన్లు చెయ్యను!
Salman Khan

అందుకే ముద్దు సీన్లు చెయ్యను!

కెరీర్ మొదలైన దగ్గర్నుంచీ తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించకూడదనే తన నిబంధనకు కట్టుబడివున్నాడు సల్మాన్ ఖాన్. 1988లో ‘బీవీ హో తో ఐసీ’ సినిమాతో నటుడిగా పరిచయమైన సల్మాన్, తన 31 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎప్పుడూ చుంబన సన్నివేశాల్లో నటించలేదు.

తెరపై లిప్‌లాక్ సీన్లలో నటించకూడదనే విషయాన్ని ఎందుకు ఒక పాలసీగా పెట్టుకున్నాడో ఇటీవల వెల్లడించాడు సల్మాన్. ఆన్‌లైన్‌లో ప్రస్తుత ధోరణులకు తనకూ పొసగదని ఒక ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపాడు. ఆహ్లాదకరమైన, యాక్షన్, హాస్యభరిత, ప్రేమకథా చిత్రాల్లో నటించడం ఇష్టమని చెప్పాడు సల్మాన్.

తన సినిమాల్ని ప్రేక్షకులు కుటుంబ సమేతంగా చూస్తారనీ, అందువల్లే తెరపై చుంబన సన్నివేశాలకూ, నగ్నత్వానికీ దూరంగా ఉంటానని ఆయన వెల్లడించాడు.

సల్మాన్ ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్ 3’ సినిమా చేస్తున్నాడు. కత్రినా కైఫ్‌తో కలిసి నటించిన ‘భారత్’ సినిమా రంజాన్ సందర్భంగా విడుదల కానున్నది.

అందుకే ముద్దు సీన్లు చెయ్యను! \ actiocutok.com

You may also like: