ఆ నటుడితో ప్రేమలో లేను: రెజీనా


ఆ నటుడితో ప్రేమలో లేను: రెజీనా
Regina Cassandra

ఆ నటుడితో ప్రేమలో లేను: రెజీనా

తెలుగు నటుడు సాయిధరం తేజ్, తమిళ తార రెజీనా కసాండ్రా మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ ప్రచారాన్ని తేజ్ ఖండించినా వదంతులు మాత్రం ఆగలేదు. తాజాగా రెజీనా సైతం ఈ వదంతులపై స్పందించింది. తను ఏ నటుడితోనూ ప్రేమలో లేననీ, తన ప్రేమ అంతా తను చేస్తోన్న పని పైనే ఉందనీ స్పష్టం చేసింది.

ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది. “కొన్ని రోజులుగా నాకూ, నా సహ నటుల్లో ఒకరికీ మధ్య అనుబంధం నడుస్తోందంటూ వదంతులు ప్రచారమవడం నా దృష్టికి వచ్చింది. అవన్నీ ఏమాత్రం ఆధారంలేని వార్తలు. ఇప్పుడు నా పనిపైనే నా ప్రేమ. దానికి మించి ఏదైనా ఉంటే, నేనే మీకు చెప్తాను” అని తెలిపింది రెజీనా.

తేజ్, రెజీనా కలిసి ‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలు చేశారు. ఈ మధ్యే ‘ఏక్ లడకీ తో దేఖా తో ఐసా లగా’తో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం తెలుగులో ‘7’ సినిమా చేస్తోంది.

ఆ నటుడితో ప్రేమలో లేను: రెజీనా | actioncutok.com

You may also like: