ఆంధ్రోడి తాట తియ్యనీకి వస్తున్న ‘టైగర్ కేసీఆర్’!


ఆంధ్రోడి తాట తియ్యనీకి వస్తున్న 'టైగర్ కేసీఆర్'!

ఆంధ్రోడి తాట తియ్యనీకి వస్తున్న ‘టైగర్ కేసీఆర్’!

ఓ యబ్బో.. రాంగోపాల్ వర్మవి మామూలు కళలు కావు.. ఆయన కళాకారులకే కళాకారుడు. ఈ మధ్యే ఆయన ట్విట్టర్ వేదికగా ‘టైగర్ కేసీఆర్’ అనే సినిమా తీస్తున్నానని ప్రకటించుండ్లా.. యాదికుందిగా! ఇప్పుడియ్యాల ఆ సినిమాని ఎట్లా తియ్యబోతున్నాడో, కేసీఆర్‌ని ఎట్లా చూపించబోతున్నాడో కొద్దిగా రుచి చూపించాడుపో..

సినిమాలో కేసీఆర్ ఏం చెప్తాడో తెలుసునా? ఆ మాటలు కూడా ఆర్జీవీ.. అదేనబ్బీ.. వర్మాజీ మాటల్లోనే వింటే పోలా.. మా సమ్మగా ఉంటది..

“మా భాష మీద నవ్వినవ్.. మా ముఖాల మీద ఊసినవ్.. మా బాడీల మీద నడిసినవ్ ఆంధ్రోడా.. వస్తున్నా.. వస్తున్నా.. నీ తాట తియ్యనీకి వస్తున్నా..”.. అంటాడంట కేసీఆర్.

అద్గదీ సంగతి. ఆ పెద్దాయన కేసీఆర్ ఏమో నాకు ఆంధ్రోళ్ల మీద శానా ప్రేమ అని ఈ మద్దెనే కదా చెప్పిండు. అలాంటిది ఆయన పరువు తియ్యనీకి “ఆంధ్రోడా వస్తున్నా. నీ తాట తియ్యనీకి వస్తున్నా” అనిపిస్తాడా.. ఆ పెద్ద మనిషి చేత!

అంటే ఏమన్న మాట. ఆ పెద్ద మనిషి ఆంధ్రోళ్ల గురించి పైకి చెప్పేవన్నీ ఉత్తుత్తి మాటలని చెప్పడమేగా వర్మ ఉద్దేశం. ఆయన మనసులో ఆంధ్రోళ్ల తాట తియ్యాలనే ఉంటదని చెప్పాలనేగా వర్మ తపన.

పైగా ఆ డైలాగ్స్ చెప్పేప్పుడు వర్మ మూతి.. పోనీ.. పళ్లు బిగించిండు చూశారా.. కేసీఆర్ కూడా పనికిరాడబ్బీ.. వర్మ హావభావాల ముందట. ఆంధ్రోళ్లను తిట్టడం ఎప్పుడో మానేసిన కేసీఆర్ చేత ఇప్పుడు పని గట్టుకొని తిట్టిపిస్తున్న వర్మ చేష్టల వెనక ఏదో మర్మం ఉండే ఉంటుందని శానామంది అనుకుంటున్నారు.

ఈ సినిమాని ఆంధ్రోళ్లను రెచ్చగొట్టనీకే తీస్తున్నాడని అనుకుంటున్నారా? మీ తప్పేమీ లేదప్పా.. అది నిజం కూడా కావచ్చేమో.. ఆంధ్రోళ్ల దృష్టిలో కేసీఆర్‌ని విలన్‌ని చెయ్యాలని చూస్తున్నాడని కూడా అంటారా? మీరేమన్నా అనుకోండప్పా.. అది మీ ఇష్టం.. వర్మాజీకేం ఫరక్ పడదు.

వీడియో క్లిప్ చివర్లో “టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్” అని చెప్పిండు వర్మాజీ. మరి చూసుకుందామా?

ఆంధ్రోడి తాట తియ్యనీకి వస్తున్న ‘టైగర్ కేసీఆర్’! | actioncutok.com

You may also like: