జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎప్పటికి దొరికేనో!


జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎప్పటికి దొరికేనో!
Jr NTR

జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎప్పటికి దొరికేనో!

జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా పూనా షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే జూనియర్ సరసన ఎంపిక చేసిన బ్రిటిష్ తార డైసీ ఎడ్గార్ జోన్స్ వ్యక్తిగత కారణాల రీత్యా తప్పుకోవడంతో సినిమా షెడ్యూల్ భారీ కుదుపుకు లోనైంది. ఆమె ప్లేస్‌లో ఇప్పటివరకూ మరొకరు రాలేదు.

ఆ కారణంగా రాంచరణ్ జోడీగా ఎంపికైన అలియా భట్ డేట్స్ వృథా అయ్యాయి. వీలైనంత త్వరలో జూనియర్ జోడీని ఎంపిక చెయ్యాలని రాజమౌళి గట్టి కృషి చేస్తున్నారు. మొదట ఆ పాత్రను బ్రిటిష్ యువతిగా రాసుకోవడం వల్లే బ్రిటిష్ తారను తీసుకున్నారు. ఇప్పుడు భారతీయ నటిని తీసుకుంటే ఆ పాత్రను పూర్తిగా మార్చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు ఈ విషయంలోనే రాజమౌళి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. పాత్రలు నిజమైనవైనా, కథ మాత్రం కల్పితం. అందువల్ల కావాలనుకుంటే బ్రిటిష్ యువతి కేరెక్టర్‌ను భారతీయ యువతి కేరెక్టర్‌గా మార్చుకొనే వెసులుబాటు రాజమౌళికి ఉంది.

ఈ విషయంలో ఇప్పటికే తన తండ్రి, చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్‌తో ఆయన చర్చలు జరిపారనీ, ఆ పాత్రను విజయేంద్రప్రసాద్ మారుస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డైసీ స్థానంలో భారతీయ నటి వస్తే ఆ పాత్రను మార్చినట్లేనని అర్థం చేసుకోవాలి. అతి త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్‌కు హీరోయిన్ ఎప్పటికి దొరికేనో! | actioncutok.com

You may also like: