ఆర్ ఆర్ ఆర్: అలియా కాల్షీట్ల సమస్య!


ఆర్ ఆర్ ఆర్: అలియా కాల్షీట్ల సమస్య!
Alia Bhatt

ఆర్ ఆర్ ఆర్: అలియా కాల్షీట్ల సమస్య!

రాంచరణ్ గాయపడటం, డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకోవడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కుదుపుకు గురయ్యాయి. యస్.యస్. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తోన్న ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని 2020 జూలై 30న విడుదల చేస్తామని నిర్మాత డి.వి.వి. దానయ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

అహ్మదాబాద్ నుంచి అర్ధంతరంగా యూనిట్ హైదరాబాద్‌కు తిరిగొచ్చేసింది. పూణేలో ఈ నెలాఖరు నుంచి చిత్రీకరణ జరపాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తాజాగా వాళ్లకు అలియా భట్ కాల్షీట్లు లభించడం తలనొప్పిగా పరిణమించనుందని వినిపిస్తోంది. అహ్మదాబాద్ – పూణే షెడ్యూల్ కోసం అలియా నెల రోజుల కాల్షీట్లు ఇచ్చింది.

కానీ అనివార్య పరిస్థితుల్లో వాటిని ఉపయోగించుకోలేని స్థితిలో పడింది ‘ఆర్ ఆర్ ఆర్’ బృందం. షెడ్యూల్ తిరిగి మొదలయ్యాక అనుకున్న విధంగా అలియా కాల్షీట్లు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. మే నెలలో ఆమె ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు సమాచారం.

దాని తర్వాత ‘కళంక్’ సినిమా ప్రమోషన్‌కు సమయం కేటాయించింది. అలాగే ‘సడక్ 2’, ‘ఇన్‌షల్లా’ సినిమాలకూ ఆమె సంతకాలు చేసింది. వీటి షూటింగ్ ఒక దాని తర్వాత ఒకటి మొదలు కానున్నాయి.

ఈ నేపథ్యంలో ‘ఆర్ ఆర్ ఆర్’కు జూన్‌లోనే ఆమె కాల్షీట్లు ఇచ్చే అవకాశం ఉందని అంతర్గత వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో ఆమె రాంచరణ్ జోడీగా నటిస్తోంది.

ఆర్ ఆర్ ఆర్: అలియా కాల్షీట్ల సమస్య! | actioncutok.com

You may also like: