వైరల్ అవుతున్న సాయిపల్లవి ఫోటోలు

వైరల్ అవుతున్న సాయిపల్లవి ఫోటోలు
మలయాళ చిత్రం ‘ప్రేమం’తో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న సాయిపల్లవి తెలుగులో ‘ఫిదా’ సినిమాలో నటించి మూకుమ్మడిగా ప్రేక్షకులనందర్నీ తన బుట్టలో వేసేసుకుంది.
తాజాగా విషు లుక్‌లో ఉన్న ఫొటోల్ని సోషల్‌మీడియాలో షేర్ చేశారు సాయిపల్లవి. కేరళ సంప్రదాయం ప్రకారం ధరించే బంగారు వర్ణం జరీ ఉన్న తెలుపు రంగు చీరలో ఆమె మెరిశారు.
‘ఈ ఏడాది విషు (ఉగాది) చాలా తొందరగా వచ్చేసింది’ అని ట్వీట్ చేశారు. ఆవిడ షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లకి విపరీతంగా నచ్చేసాయి. నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తూ మంచి కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా సాయిపల్లవి మలయాళ చిత్రం ‘అథిరన్’లో కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కేరళ ముఖ్యపండగ అయిన విషు సందర్భంగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆందుకుగాను జరుగుతున్న ప్రమోషనల్ ఆక్టివిటీలో భాగంగా ఈ ఫోటో షూట్ జరిగింది.
సాయిపల్లవి గత ఏడాది ‘పడి పడి లేచె మనసు’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆవిడ నటనకు మంచి ప్రశంసలు అందాయి. ప్రస్తుతం ఆమె ‘ఎన్జీకే’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. సూర్య కథానాయకుడు కాగా.. రకుల్ ప్రీత్ సింగ్ మరో కథానాయిక. సెల్వరాఘవన్ దర్శకుడు.
వైరల్ అవుతున్న సాయిపల్లవి ఫోటోలు | actioncutok.com
You may also like: