ఇంట్లోంచి గెంటేసిందని హీరోయిన్‌పై తల్లి ఫిర్యాదు!


ఇంట్లోంచి గెంటేసిందని హీరోయిన్‌పై తల్లి ఫిర్యాదు!
Sangeetha

ఇంట్లోంచి గెంటేసిందని హీరోయిన్‌పై తల్లి ఫిర్యాదు!

నటి సంగీత గుర్తుంది కదా.. ‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘సంక్రాంతి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆమె 2009లో కృష్ణస్వామిని వివాహమాడింది. వాళ్లకు ఒక పాప.

తాజాగా ఆమె ఒక వివాదంలో చిక్కుకున్నారు. సంగీత తనను వేధిస్తున్నట్లు స్వయంగా ఆమె తల్లి భానుమతి తమిళనాడు మహిళా మహిళా సంఘంలో ఫిర్యాదు చేయడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తనను కూతురు, అల్లుడు కలిసి ఇంట్లోంచి గెంటేశారని ఆమె ఆరోపించారు.

“ఆ ఇంటిని నేను నా కొడుకులకు ఇచ్చేస్తానేమోనని వాళ్లు భయపడ్డారు. అందుకే వృద్ధురాలినని కూడా చూడకుండా ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటూ నన్ను వేధించారు” అని తన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. భానుమతి ఫిర్యాదుపై వివరణ ఇవ్వాల్సిందిగా సంగీతకు ఇటీవల మహిళా సంఘం సమన్లు జారీ చేసింది.

కాగా, తనకు వ్యతిరేకంగా తల్లి చేసిన ఆరోపణలను సంగీత ఖండించింది. తల్లి తనకెప్పుడూ తల్లిప్రేమను పంచలేదని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దానికి బదులు చిన్నప్పుడు, టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆమె తనపై చాలా కఠినంగా వ్యవహరించిందని చెప్పింది. పెళ్లి విషయంలోనూ తల్లితో పోరాటం చెయ్యాల్సి వచ్చిందని కూడా సంగీత తెలియజేసింది.

“నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు థాంక్స్ అమ్మా” అని వ్యంగ్యంగా ఒక ప్రకటనలో చెప్పింది సంగీత.

ఇంట్లోంచి గెంటేసిందని హీరోయిన్‌పై తల్లి ఫిర్యాదు! | actioncutok.com

You may also like: