‘మెర్సాల్’ రీమేక్‌లో షారుఖ్!


'మెర్సాల్' రీమేక్‌లో షారుఖ్!
Shahrukh Khan

‘మెర్సాల్’ రీమేక్‌లో షారుఖ్!

షారుఖ్ ఖాన్ చివరిసారిగా 2018 డిసెంబర్‌లో వచ్చిన ‘జీరో’ సినిమాలో కనిపించాడు. అప్పట్నుంచీ ఆయన తర్వాతి సినిమాల గురించి ఎన్నో ప్రచారాలు జరుగుతున్నా, ఇప్పటివరకూ ఏ ఒక్క సినిమానీ ఆయన అధికారికంగా ధ్రువీకరించలేదు.

తాజా సమాచారం ప్రకారం ఆయన తమిళ బ్లాక్‌బస్టర్ ‘మెర్సాల్’ రీమేక్‌లో నటించనున్నాడు. విజయ్ హీరోగా నటించిన ‘మెర్సాల్’ను అట్లీ డైరెక్ట్ చేశాడు. మంగళవారం రాత్రి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ సందర్భంగా అట్లీ పక్కనే షారుఖ్ కూర్చొని మాట్లాడుతూ కనిపించడం ఆ ప్రచారానికి బలం చేకూర్చినట్లయింది.

2017లో వచ్చిన ‘మెర్సాల్’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి విజయ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఇందులో విజయ్ మూడు పాత్రలు చేశాడు. నిత్యా మీనన్, సమంత, కాజల్ అగర్వాల్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి డైరెక్టర్‌తో పాటు వి. విజయేంద్రప్రసాద్ స్క్రీన్‌ప్లే సమకూర్చడం గమనార్హం.

ఈ సినిమాని షారుఖ్ చేస్తున్నాడంటే ఆయన ట్రిపుల్ రోల్‌లో కనిపించనున్నాడన్న మాటే. ఈ సినిమాకి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

'మెర్సాల్' రీమేక్‌లో షారుఖ్!
A still from Mersal

‘మెర్సాల్’ రీమేక్‌లో షారుఖ్! | actioncutok.com

You may also like: