ఆమె (She)


ఆమె (She)

ఆమె (She) – బుద్ధి యజ్ఞమూర్తి

లోకం నేనేమిటో చెప్పక ముందే
నన్ను నేను తెలుసుకోవాలని ఉంది
నేనెప్పుడూ అమ్మ కథ అడగలేదు
చిత్రం.. అమ్మ కూడా తన కథ చెప్పలేదు
నా కథ నా డైరీల్లో భద్రంగా ఉంది
నా డైరీలు చూస్తుంటే నాతో నేను సంభాషిస్తున్నట్లే ఉంటుంది
నా ఇన్‌ఫాచ్యుయేషన్స్, నా భగ్న ప్రేమలు,
నా అనుభూతులు, నా అనుభవాలు నాతో నేను
పంచుకుంటున్నట్లే ఉంటుంది
నా కథ చెబుతోంది
నాది అనుకున్నదేదీ నాది కాదని
నాకు అర్థమవుతోంది
ఆనంద క్షణాలు స్వల్పమని
బాధామయ సందర్భాలు అనల్పమని
అందరూ ఉండీ ఒక స్త్రీగా
ఎంత ఒంటరినో బాగా తెలిసింది

– కవితాఝరి (ఫేస్‌బుక్ గ్రూప్), 5 ఏప్రిల్ 2016

ఆమె (She) – బుద్ధి యజ్ఞమూర్తి | actioncutok.com

You may also like: