‘సీత’ రిలీజ్ డేట్ మారింది


'సీత' రిలీజ్ డేట్ మారింది

‘సీత’ రిలీజ్ డేట్ మారింది

కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ కలిసి నటించిన రెండో చిత్రం ‘సీత’ (మొదటి చిత్రం ‘కవచం’) విడుదల తేదీ మారింది. తేజ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. అయితే దానికి తగ్గట్లు పబ్లిసిటీ జరక్కపోవడంతో విడుదల తేదీ మారే అవకాశాలున్నట్లు అర్థమైంది.

దానికి అనుగుణంగానే తాజాగా మే 24న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. విడుదల పోస్ట్‌పోన్ అవడానికి గల కారణాలు వెల్లడి కాలేదు. మన్నారా చోప్రా మరో నాయికగా నటించిన ఈ చిత్రంలో సోనూ సూద్ విలన్ కేరెక్టర్ చేశాడు. ఇప్పటివరకూ మాస్, యాక్షన్ రోల్స్ చేస్తూ వచ్చిన శ్రీనివాస్ తొలిసారి ‘సీత’లో అమాయక యువకుడిగా కనిపించనున్నాడు. అతడి పాత్రకు భిన్నంగా వివేకవంతురాలైన వ్యాపారవేత్తగా కాజల్ నటించింది.

పరుచూరి బ్రదర్స్ రచన చేసిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు.

‘సీత’ రిలీజ్ డేట్ మారింది | actioncutok.com